దిల్ రాజు రెండో పెళ్లి మ్యాటర్.. వెలుగులోకి అసలు నిజాలు...?
గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో దిల్ రాజు రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్న దిల్ రాజు రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతూ ఉండటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు వయస్సు 49 సంవత్సరాలు. దిల్ రాజు భార్య అనిత 2017 సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందారు.
భార్య చనిపోయిన తరువాత దిల్ రాజు ఒంటరి అయిపోయాడు. దిల్ రాజు కూతురికి ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. వరుస సినిమాలతో బిజీ కావడంతో దిల్ రాజు తన ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. దిల్ రాజుకు మళ్లీ పెళ్లి చేయాలని కూతురు, అల్లుడు, బంధువులు, సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారని అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఈ వార్త నిజమే అయినప్పటికీ దిల్ రాజు కుటుంబం మాత్రం ఈ వార్త గురించి కొంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని ఒక యువతితో దిల్ రాజు పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. మానసికంగా దిల్ రాజు దృఢంగా ఉండేందుకు రెండో పెళ్లి అవసరమని చాలా సింపుల్ గా ఈ వివాహం జరగనుందని సన్నిహితులు, బంధువులు నిర్ణయించారని తెలుస్తొంది. ఒక బ్రాహ్మణ యువతిని దిల్ రాజు వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.
త్వరలోనే ఈ రెండో పెళ్లి గురించి కీలక సమాచారం బయటకు రానుందని తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇటీవలే జానుతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో సీనయ్య, పింక్ రీమేక్ తెరకెక్కుతున్నాయి. దిల్ రాజు అధికారికంగా రెండో పెళ్లి వార్తల గురించి స్పందించాల్సి ఉంది. దిల్ రాజు స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.