ఛ, మీరు మరీను రాజమౌళి గారు.....ఆఖరికి అక్కడ కూడా మీకు అదే ఆలోచనైతే ఎలా సర్....??
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి, ఫస్ట్ మూవీ తో బెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ తో కలిసి ఆయన తీసిన సింహాద్రి పెద్ద విజయాన్ని అందుకుంది, అనంతరం మరొక్కసారి ఎన్టీఆర్ తోనే ఆయన తీసిన యమదొంగ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక అక్కడి నుండి వరుసగా చిన్న, పెద్దా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగిన రాజమౌళి, ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో తన పేరును విశ్వవ్యాప్తం చేసుకోవడంతో పాటు టాలీవుడ్ సినిమా రేంజ్ ని హాలీవుడ్ స్థాయికి పెంచారని చెప్పాలి.
ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ని తీస్తున్న రాజమౌళి, ఆ సినిమా ద్వారా కూడా మరొక అద్భుత విజయాన్ని అందుకుని తన పేరుని మరింత మారుమ్రోగేలా చేయాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా తీసిన సినిమాల్లో ఒక్క అపజయం కూడా చూడని రాజమౌళి, తన సినిమాల వరుస సక్సెస్ గురించి అడిగితే మాత్రం, అది తన టీమ్ వర్క్ అని, అందరి కృషి ఉండబట్టే తమ సినిమాలకు ప్రేక్షకాదరణ లభిస్తోందని చెప్తుంటారు.
అయితే ఆయన భార్య రమ సహా మరికొందరు ఆయన యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, అలానే మరికొందరు ఆయన సన్నిహితులు చెప్పిన దానిని బట్టి చూస్తే, రాజమౌళి ఎప్పుడూ కూడా తాను చేస్తున్న సినిమా విషయమై ఎల్లవేళలా ఆలోచన చేస్తూనే ఉంటారని, ఆఖరుకి భోజనం చేసేటపుడు, పడుకునేటపుడు కూడా ఆయనకు అదే ఆలోచనట. నేడు నేను తీసిన సీన్ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అంటూ అదే పనిగా ఆలోచించే రాజమౌళి, తన సినిమాని ముందుగా ఒక ప్రేక్షకుడిగా భావించి, అది తనను ఎంతవరకు సంతృప్తి పరుస్తుంది అని ఆలోచన చేస్తారట. సో, అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అని ఇప్పుడు మనకు చాలా వరకు అర్ధం అవుతుంది కదూ. అయితే ఈ విషయమై మాత్రం కొందరు నెటిజన్లు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎన్నో గొప్ప సినిమాలు చేసారు సర్, కాకపోతే మరీ ఇంతలా తినేటపుడు, పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచన అయితే ఎలా సర్ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు....!!