బన్ని ఆ విషయంలో కూడా అందరిని మించిపోయాడు ..!

Kunchala Govind

ప్రస్తుతం అల్లు అర్జున్ మాంచి ఫాం లో ఉన్నాడు. గత సంవత్సరం నా పేరు సూర్య తో ఫ్లాప్ చూసిన బన్నీ కాస్త గ్యాప్ తీసుకొని ‘అల... వైకుంఠపురంములో’ సినిమాతోతో ఈ సంక్రాంతికి బరిలో దిగాడు. ఈ సినిమాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు సాధించాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను బుధవారం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి. శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి. జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. రఘు, వై. రవిచంద్ర, కె. ఫణి, వి. శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ తది కలిశారు. సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్‌ను అభినందించారు.

 

అయితే ఇదే సందర్భంలో బన్ని వీళ్ళకి చిన్న చాకిచ్చాడు. జర్నలిస్టుల సంక్షేమానికి.. ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్న స్టైలిష్ స్టార్ వాళ్ళని అభినందిస్తూ ఆ క్షణమే తన వంతుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తాము వచ్చింది అభినందించడానికి మాత్రమేనని, ఆర్థిక సహాయం కోరడానికి కాదని అసోసియేషన్ ప్రతినిధులు అల్లు అర్జున్‌ తో చెప్పారు. అయినా కూడా ‘మీరు చేస్తున్న కార్యక్రమాలు నాకు బాగా నచ్చాయి. ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే. ఇకముందు కూడా మీకు సహాయం చేస్తాను’ అని మాటిచాడు అల్లు అర్జున్‌.

 

ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కృషి ప్రశంసనీయం. మంచి పనులు చేస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నా వంతుగా కొంత సహాయం చేస్తున్నాను. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. జర్నలిస్టులపై నాకెంతో గౌరవం ఉంది. మా సినిమాలను అభిమానులు, ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళేది జర్నలిస్టులే. వాళ్ల సంక్షేమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టులకు ఏ సహాయం కావలసిన నేను ముందుంటాను. ఇండస్ట్రీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీరంతా ఒకటే అని చూపించాలి’ అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: