అఫీషియల్ న్యూస్ : 'ఆర్ఆర్ఆర్' కు చావుదెబ్బేసిన రాజమౌళి....రిలీజ్ వాయిదా.... !!

GVK Writings

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించనున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, అలానే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సముద్ర ఖని, 

 

అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని తొలుత ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్లుగా దేశవ్యాప్తంగా పలు వార్తలు ప్రచారం అయ్యాయి. కాగా దానిపై ఇప్పటివరకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుండి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో అది నిజం కాదని అని అందరూ భావించారు. కాగా నేడు అందరికీ షాక్ ఇస్తూ, తమ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్, అఫీషియల్ గా ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. 

 

ఇక ఈ ప్రకటనతో కొందరు సినీ ఫ్యాన్స్ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అనుకున్న విధంగా కాకుండా సినిమాని పోస్ట్ పోన్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి అయినప్పటికీ కూడా, పలు టెక్నీకల్ అంశాల తోపాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందని, అది పూర్తి కావడానికి ఈ ఏడాది నవంబర్ వరకు సమయం పడుతుందని, అందుకే సినిమాని ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ సిద్ధం అయినట్లు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ న్యూస్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు రాజమౌళి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: