పింక్ షూటింగ్ లో పవన్ తడబాటు !

frame పింక్ షూటింగ్ లో పవన్ తడబాటు !

Seetha Sailaja

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన విషయం ఎంత దాచాలనుకున్నా అది దాగడం లేదు. పవన్ షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫొటోలు బయటకు రాకుండా చేయగలిగినా ఏదో విధంగా పవన్ కొత్త సినిమా లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి పవన్ సినిమాను తీస్తున్న నిర్మాతలు నెట్ లో పవన్ కొత్త లుక్  ఫొటోలు కనిపిస్తే చాలు యూనిట్ చేత డిలీట్ చేయిస్తున్నారు. 

దీనితో ఈ విషయాన్ని ఎంతకాలం దాచగలరు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘పింక్’ షూటింగ్ స్పాట్ లో పవన్ ఏమాత్రం ఉత్సాహం లేకుండా యాంత్రికంగా కెమెరా ఆర్క్ లైట్స్ ముందు నుంచోవడం అదేవిధంగా తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ పేపర్ పై కూడ పవన్ తన దృష్టిని పెట్టకుండా పరధ్యానంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ క్రిష్ ల రెండవ సినిమా ప్రారంభోత్సవం రోజునే ‘జనసేన’ నేత జెడి లక్ష్మీనారాయణ ‘జనసేన’ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా తనకు పవన్ సినిమాలలో నటించడం ఇష్టం లేదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వాస్తవానికి పవన్ మళ్ళీ నటించాలని అభిమానులు కోరుకుంటున్నా పవన్ ఎంచుకుంటున్న కథలు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. 

దీనితో రోజురోజుకు జనసేన పార్టీ నుండి వెళ్ళిపోతున్న నాయకుల లిస్టు పెరిగి పోతుంటే పవన్ నటించే సినిమాల కథల ఎంపిక అభిమానులకు కూడ నచ్చని పరిస్థితులలో పవన్ సినిమా రీ ఎంట్రీ వల్ల ఏమి ప్రయోజనం అన్న అభిప్రాయం ప్రస్తుతం పవన్ వీరాభిమానులలో కూడ ఉంది. ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ షాక్ తో సినిమాల పై వైరాగ్యం పెంచుకున్న పవన్ కు ‘పింక్’ రీమేక్ హిట్ అవ్వకపోతే పవన్ కు మరింత షాక్ ఇవ్వడమే కాకుండా పవన్ అభిమానులకు కూడ తీవ్ర నిరాశను కలిగిస్తుంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: