డిజిటల్ ప్లాట్ ఫాంపై చిచ్చరపిడుగులు వీళ్లు..!

NAGARJUNA NAKKA

స్టార్డమ్ తెచ్చుకోవడానికి ఇప్పటికే హీరోలు, డైరెక్టర్లు చాలా కష్టపడుతుంటారు. సినిమా సినిమాకు ప్రూవ్ చేసుకుంటూ, సక్సెస్ రేట్ ని పెంచుకుంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. అయితే వాళ్ల వారసురాళ్లు మాత్రం స్కూల్ డేస్ లోనే బోల్డంత ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంపై చిచ్చరపిడుగుల్లా దూసుకెళ్తున్నారు. 


మహేశ్ బాబుకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. అతని కూతురు సితార కూడా అంతే స్టార్డమ్ తెచ్చుకుంటోంది. స్కూల్ కు వెళ్లే ఏజ్ లోనే  ఎ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నెట్ వరల్డ్ లో హల్ చల్ చేస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార చేస్తోన్న వీడియోలు, ఇంటర్వ్యూలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

సుకుమార్ సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ లెక్కల మాస్టర్ మేకింగ్ కు రాజమౌళి లాంటి దర్శకులు కూడా ఫిదా అవుతుంటారు. అయితే సుకుమార్ ఈ స్టేజ్ కు వెళ్లడానికి ఎంతో టైమ్ పడితే.. అతని కూతురు సుకృతి మాత్రం ఎక్కాలు నేర్చుకునే టైమ్ లోనే స్టార్డమ్ తెచ్చుకుంటోంది. అర్బస్ జామ్ విత్ సుకృతి అనే మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ చేసింది. 

ఇప్పుడు డిజిటల్ మీడియా థియేటర్లకు గట్టిపోటీ ఇస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమా లవర్స్ ను డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు లాక్కొస్తున్నాయి. ఇక పిల్లలు కూడా ఈ డిజిటల్ వరల్డ్ కు పరుగులు పెడుతున్నారు. ఈ ఇదినే క్యాష్ చేసుకుంటూ తమ ప్రతిభను యూట్యూబ్ లకు ఎక్కిస్తున్నారు సెలబ్రిటీ కిడ్స్.  

 

మొత్తానికి మహేశ్ బాబు కూతురు సితార తండ్రికి మించిన తనయురాలిగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే మంచి ఫ్లాట్ ఫార్మ్ ను  సిద్ధం చేసుకుంటోంది. చిన్న వయసులోనే అపార ప్రతిభను కనుబరుస్తూ వావా అనిపిస్తోంది. ఇటీవల మహేశ్ బాబును ఇంటర్వ్యూ చేసి ఔరా అనిపించింది. రాబోయే రోజుల్లో సితార.. సినీ ఇండస్ట్రీలో ఓ తారగా వెలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: