అల్లుఅర్జున్ అప్పుడే మొదలెట్టేశాడా...ఎక్కడా గ్యాప్ తీసుకోవడం లేదుగా?
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో వున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ `అలా వైకుంఠపురంలో` చిత్రం ఫుల్ వసూళ్లను సాధిస్తూ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ గా నిలిచే అవకాశం వుంది. బాహుబలి2, సాహో చిత్రాల తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు ప్రీ రిలీజ్ చేసిన బిజినెస్ కు 70 శాతం వరకు రికవరీ చేసేసినట్లు సమాచారం. మరి అల్లు అర్జున్ ఇదే జోష్ లో సుకుమార్ చిత్రం లో నటించబోతున్నాడు. ఇక ఎక్కడా బ్రేక్ లేకుండా ఆయన వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళిపోతానని ఇటీవలె జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అల్లుఅర్జున్‌కి కాస్త గ్యాప్ ఎక్కువే వచ్చినా కూడా తన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని రీసెంట్గా విడుదలైన అల చిత్రం ద్వారా నిరూపించుకున్నారనిపించింది. అలాగే అల్లు అర్జున్‌కి వేరే హీరోల్లా కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి.