లేడీ అమితాబ్ పవర్ తగ్గలేదు బాసూ..
టాలీవుడ్ లో 80వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఆమె నటించిన కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి మూవీలతో సోలో గా ఇండస్ట్రీ హిట్ లు అందుకున్నారు. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన ఆమె లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరహా పాత్రల్లో ఎక్కువ నటించడంతో ఆమె సినిమాలు వరుస ఫ్లాపులు అయ్యాయి. దాంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదట బీజేపీ లో చేరిన ఆమె అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కేసీఆర్ వెంట నడిచారు.
ఈ నేపథ్యంలో విజయశాంతి మెదక్ ఎంపీ పదవిలో కొనసాగారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక.. సీఎం కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఈ పార్టీలోనే ఆమె కొనసాగుతున్నారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. గతంలో ఆమె ఎంత పవర్ ఫుల్ గా ఉండేవారొో.. అదే తరహా పాత్రలో నటించారు.
తాజాగా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సెట్స్ లో పర్ఫెక్ట్ కిక్ ఇస్తున్న విజయ శాంతి వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. 55ఏళ్ల విజయశాంతి అలా ఓ అద్భుతమైన కిక్ ఇవ్వడం ఆమె ఫిట్ నెస్, ఎనర్జీ లెవెల్స్ తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల్లా ఫైట్స్ లో ఇరగదీసిన విజయశాంతి ఇప్పుడు కూడా తన పవర్ ఏమాత్రం తగ్గలేదు అన్నట్లు ఈ మార్షల్ కిక్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో తాను ఇక రాజకీయాల్లో కన్న మూవీస్ పైనే ఎక్కువ ఫోకస్ చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పింది.
That's the 2020 Kick! She has got the skill @vijayashanthi_m garu even after all these years... Agreed!#BlockBusterSarileruNeekevvaru #BlockBusterKaBAAP #HappyBhogi
Super Star @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @iamRashmika @ThisIsDSP pic.twitter.com/0CiZPznIUE — BARaju (@baraju_SuperHit) January 14, 2020