ఇల్లీ బేబీ తొలిముద్దు సీక్రెట్..?
టాలీవుడ్ లో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని, గోవా బ్యూటీ ఇలియానా తొలిసారిగా నటించిన ‘దేవదాసు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా ఈ మూవీలో తన నడుం వొంపుల సోయగాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఆ తర్వాత తెలుగు లో వరుసగా టాప్ హీరోల సరసన ఛాన్సులు కోట్టేస్తూ నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది. తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ అందుకుంటున్న ఈ బ్యూటీ బాలీవుడ్ ని ఏలేద్దామని వెళ్లింది. కానీ అక్కడ వరుస డిజాస్టర్స్ తో దిమ్మతిరిగింది తిరిగి తెలుగులోకి రావాలని చూసినా.. అప్పటికే కాజల్, అనుష్క, త్రిష, రకూల్ ఇలా వరుసగా హాట్ బ్యూటీస్ టాలీవుడ్ ని ఏలేశారు. దాంతో కనీసం ఐటమ్ సాంగ్ లో కూడా ఛాన్సు దొరకలేదు.
ఇంతలోనే ఇలియానా ప్రేమాయణం నడిపించడం.. తర్వాత విడిపోవడం జరిగిపోయింది. ప్రస్తుతం తన ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంది.. ఇల్లీబేబి. ఆ మద్య రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోని మూవీలో నటించింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు..అందులోనూ ఇలియానా పర్సనాలిటీ చూసి విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే.. జీవితంలో తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి ఎప్పటికి ఓ మధురమైన జ్ఞాపకంగానే ఉంటాయి.
జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికీ మర్చిపోలేం. తాజాగా తన జీవితంలో కూడా ఉన్నాయంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. తన మొదటి ముద్దు గురుంచి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. నా ఫస్ట్ కిస్ ఓ హీరోతో అని చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వీరిద్దరూ కలిసి నటించిన దేవదాస్ మూలీలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఇద్దరికీ ఇది తొలిసినిమానే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.