'అల వైకుంఠపురములో' : ఆ మూడు సినిమాల కిచిడి...??
ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా అలవైకుంఠపురములో నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమా ఎర్లీ షోస్ నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు యావరేజ్ టాక్ లభించిందని అంటున్నారు. ఇక హీరోగా బన్నీ, హీరోయిన్ పూజల పెయిర్ సినిమాలో ఎంతో బాగుందని, మధ్యలో వచ్చే కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ పంచెస్ బాగున్నాయని, ఇక రెండు సాంగ్స్ అయితే ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ గా నిలవడం ఖాయం అంటున్నారు. ఎప్పటివలె బన్నీ తన హిలేరియస్ యక్షన్ తో సినిమాని ముందుకు నడిపించాడని, ఇక ఆయన తండ్రిగా నటించిన మురళి శర్మ,
అలానే కీలక పాత్రల్లో నటించిన టబు, సుశాంత్, నివేత పేతురాజ్, సముద్ర ఖని వంటి వారి నటన బాగున్నట్లు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమా కథా వస్తువుగా మంచి పాయింట్ ని ఎంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, దానిని స్క్రీన్ పై ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం చాలా చోట్ల విఫలం అయినట్లు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా చూస్తున్నంత సేపు కూడా, అవి త్రివిక్రమ్ గత సినిమాలైన అజ్ఞాతవాసి, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తిని అందరికీ గుర్తు చేస్తాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మంచి రొమాంటిక్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో సాగగా, ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుందని,
అలానే దాని తరువాత సెకండ్ హాఫ్ లో వచ్చే మంచి యాక్షన్ సీన్స్, ఫైట్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ వంటివి బాగున్నాయని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం సినిమా చాలావరకు సాగతీతగా సాగుతుందని, అలానే త్రివిక్రమ్ నుండి కొత్తదనాన్ని ఆశించి థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడి సహనాన్ని ఆయన పరీక్షించినట్లు చెప్తున్నారు. ఇక నిర్మాణ విలువల పరంగా, ఫోటోగ్రఫి పరంగా, మ్యూజిక్, బ్యాక్ స్కోర్, ఫైట్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన సినిమా ఫక్తు యావరేజ్ సినిమా అని రిపోర్టులు వస్తున్నాయి. మరి మున్ముందు ఈ సినిమా ఎటువంటి టాక్ ని సంపాదించి ముందుకు సాగుతుందో చూడాలి.....!!