బ‌న్నీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టిన మ‌హేష్‌... నెవ్వెర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌..!

Satvika

సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబు  హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఇప్పటివరకు ఈ చిత్రం నుండి వచ్చిన అన్నీ ఈ చిత్రం పై అంచనాలను పెంచుతున్నాయి. సంక్రాంతి కి జ‌న‌వ‌రి 11న ప్రపంచవ్యాప్తం గా  విడుదల కానుంది. 


దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణ లో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై అనిల్ సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.అయితే,ఈ సినిమా కేర‌ళ లో కొత్త రికార్డును క్రియేట్ చేయడానికి సిద్దమవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను 30 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నార‌ట‌. ఓ తెలుగు సినిమా ఇన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం ఇదే మొదటిసారి. 

 

కేరళ లో మహేష్  క్రేజ్  మార్కెట్ వర్గాలకే బిగ్ షాక్ ఇస్తోంది. అక్కడ రిలీజ్ కు ముందే సరిలేరు ఓ కొత్త రికార్డు సొంతం చేసుకుంది. కేరళ లోనే దాదాపు 30  సెంటర్లలలో ఓ తెలుగు సినిమా రిలీజవ్వడం అన్నది రేర్. కానీ సరిలేరు తో అది సాధ్యమైంది. ఈ సినిమాలో డైలాగ్ మాదిరిగానే.. `నెవ్వెర్ బిఫోర్ ..ఎవ్వర్ ఆప్టర్`  అన్నట్లే రిలీజవుతోంది. 

 

అస‌లు అక్క‌డ మ‌న తెలుగు హీరోల్లొ ఒక్క బ‌న్నీ సినిమాల‌కే క్రేజ్ ఉంటుంది. బ‌న్నీని మ‌ల్లూవుడ్ బ‌న్నీ అని ముద్దుగా పిలుస్తుంటారు. అక్క‌డ బ‌న్నీ సినిమాలు బాగా ఆడ‌తాయి. ఇప్పుడు బ‌న్నీ రికార్డుల‌ను బీట్ చేసి రిలీజ్‌కు ముందే  మహేష్ అరుదైన రికార్డు అందుకున్నారు. `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అక్కడ రిలీజ్ అవుతోంది. శనివారం ఉదయం 6.30 గంటలకు మొదటి షో థియేటర్ లో పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: