ఆ ఒక్క మాటతో అందరి మనసులు దోచేసిన అల్లు అర్జున్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా... అదే సమయానికి సరిలేరు నీకెవ్వరు సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఇద్దరు హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొననుంది . ఇక ఈ రెండు సినిమాల ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈమధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా... అల వైకుంటపురములో సినిమాకు మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ జరిగింది.అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో అల్లు అర్జున్ అన్ని సినిమాల గురించి ప్రస్తావించి అభిమానులే కాదు అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అల వైకుంఠపురములో సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు కూడా సంక్రాంతికి ముందు రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నా తరపు నుంచి సరిలేరు నీకెవ్వరు టీమ్ అందరికీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ టెక్నీషియన్ మహేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ అంటు అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సంక్రాంతికి విడుదలవుతున్న మరో సినిమా ఎంతో మంచివాడురా సినిమా కూడా హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కళ్యాణ్ రామ్ తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ఆ సినిమా కూడా బాగా ఆడాలని చెప్పారు అల్లు అర్జున్. ఇకపోతే ఈ మాటలతో అల్లు అర్జున్ అందరి మనసులలో చేశారు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా అసలుసిసలైన పోటీ ఉన్నది అల వైకుంఠ పురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య.
సినిమా మొదలైనప్పటి నుంచి ప్రచార కార్యక్రమాలు విడుదల తేదీ వరకూ అంతా పోటీ నెలకొంది ఈ రెండు సినిమాల మధ్య. అయితే అల్లు అర్జున్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే మహేష్ బాబు నుంచి ఇప్పుడు వరకు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించలేదు. అటు సరిలేరు నీకెవ్వరు టీమ్ నుంచి కూడా దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. అల్లు అర్జున్ సినిమాకి ఎవరు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. దీంతో కొంతమంది అభిమానులు సరిలేరు నీకెవ్వరు సినిమా చిత్ర బృందం నుంచి ఒక్కరైనా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తే బాగుండదేమో అని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై సరిలేరు నీకెవ్వరు టీమ్ ఎవరైనా స్పందిస్తారా లేదో చూడాలి మరి.