నిన్నటిరోజు వరకు రిలీజ్ డేట్ వార్ నేడు ప్రీమియర్ షోల వార్ !

Seetha Sailaja

‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య రిలీజ్ డేట్ వార్ ముగిసి పోవడంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల దృష్టి ప్రీమియర్ షోల వార్ పై పడింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల సంఖ్య విషయంలోను అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో పండుగ సమయంలో వేయబోయే అదనపు షోలు ప్రీమియర్ షోల విషయంలో ఒకదాని పై ఒకటి పోటీ పడుతూ అత్యధిక కలక్షన్స్ ను సంక్రాంతి ముగిసేలోగా రాబట్టుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి.

ఈ రెండు సినిమాలను భారీ రేట్లకు ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడ అమ్మిన రీత్యా తాము పెట్టిన పెట్టుబడిని వీలైనంత వరకు సంక్రాంతి ముగిసేలోగా రప్పించు కోవాలని అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి.అమెరికాలో మహేష్ కు ఉన్న మ్యానియా రీత్యా ప్రీమియర్ షోలకు ఎక్కువ రెట్లు పెడితే త్రివిక్రమ్ కు ఉన్న క్రేజ్ రీత్యా ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్ ప్రీమియర్ షోలకు కూడ భారీ రేట్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు వేసుకోవడానికి టిక్కెట్ల రెట్లు పెంచుకోవడానికి సులువుగానే అనుమతులు వస్తున్న పరిస్థితులలో మహేష్ బన్నీల సినిమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ ముగిసే వరకు టిక్కెట్స్ రేట్స్ ను భారీగా పెంచాబోతున్నట్లు టాక్. ఇదే ప్రయత్నం మహేష్ బన్నీల సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనపు షోలకు ప్రీమియర్ షోలకు టిక్కెట్ల రేటు పెంపుకు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి జనవరి 11న తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లు దొరికిన నేపధ్యంలో ఈ మూవీ టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో మహేష్ మూవీ ఖచ్చితంగా బన్నీ మూవీకన్నా భారీ ఓపెనింగ్స్ రాబట్టే వ్యూహాలలో ఇప్పుడు ‘సరిలేరు’ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో రిలీజ్ డేట్ వార్ ముగిసినా ప్రీమియర్ షోల వార్ ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: