మెగా ఫాన్స్ భయపడుతున్నారా..?

praveen

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు... ఇప్పటి వరకూ తాను తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు నమోదుచేసేలా  తెరకెక్కించిన సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఈ సినిమా మరింత అంచనాలు పెంచుతోంది. ఇకపోతే మరోవైపు మెగా మేనల్లుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురం సినిమా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. 

 

 

 అయితే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇక అల వైకుంఠపురములో దర్శకుడేమో మాటలతో మాయ చేసి ప్రేక్షకులందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ...మరోవైపు  సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్  రావిపూడి తనదైన సినిమా మేకింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తూ ఫామిలీ ఎమోషన్స్ తో కట్టిపడేస్తు ఉంటాడు. దీంతో సంక్రాంతి బరిలో ఏ సినిమా నిలిచి గెలుస్తుంది అన్నది  ప్రస్తుతం నెలకొన్న ఆసక్తి. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త భయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. మహేష్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధిస్తోన్నాయి . 

 

 

 ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అలా వైకుంఠపురములో  సినిమా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ముందు నిలుస్తుందా అని కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి బన్నీ కి సరైన హిట్ మాత్రం లేదు. సరైనోడు  సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకుల  ముందుకు వచ్చినప్పటికీ అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అలా వైకుంఠపురములో  సినిమా... వరుస సినిమాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ముందు నిలుస్తుందా నిలిచి గెలుస్తుందా అన్నది మెగా ఫాన్స్ లో ప్రస్తుతం చిన్న ప్రశ్న నెలకొందని టాక్ వినిపిస్తోంది. మరి సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల్లో  ఏ సినిమా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: