ప్రతి రోజు పండుగే మ్యానియా చూసి పెరిగి పోతున్న సాయి తేజ్ భయాలు !

Seetha Sailaja

పాజిటివ్ టాక్ తో మొదలైన ‘ప్రతిరోజు పండుగే’ ఇప్పడు ఈ మూవీకి పోటి ఇవ్వగల  సరైన సినిమా ఏది లేకపోవడంతో పాటు ఈ వారం కూడ మంచి సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ సూపర్ హిట్ మూవీ రేంజ్ లో దూసుకు పోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ మూవీ 31 కోట్ల షేర్ సాధించింది అని వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీ ఒక విషయంలో ‘బాహుబలి’ రికార్డులను క్రాస్ చేయడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. ఈ తన రన్ లో  13వ రోజు  తెలుగురాష్ట్రాలలో  2.91 కోట్ల షేర్ వసూలు చేసింది అని వార్తలు వస్తున్నాయి. అసలు మూడు రోజుల తర్వాత సినిమాలకు కలెక్షన్స్ చల్లబడిపోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ 13వ రోజు కూడా 2.91 కోట్ల షేర్ వసూలు చేయడం ఇండస్ట్రీలో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘బాహుబలి’ వన్ కూడ కూడా 13వ రోజు 3 కోట్ల కంటే తక్కువే షేర్ తీసుకొచ్చింది అన్న వార్తలు ఉన్నాయి. దీనితో చరిత్రసృష్టించిన ‘బాహుబలి’ వన్ రేంజ్ తో సాయి తేజ్ సినిమాకు పోలిక ఏమిటి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తేజ్ మాట్లాడుతూ ‘ప్రతిరోజు పండుగే’ మూవీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందనీ తాను కాని మారుతీ కాని కలలో కూడా అనుకోలేదు అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో సాయి తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ కథ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు టాక్. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కథ విషయంలో సాయి తేజ్ చాల జాగ్రత్తలు  తీసుకుంటూ పెరిగిన తన మార్కెట్ ను కాపాడుకోవడానికి తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: