వామ్మో వారం రోజుల్లోనే అన్ని కోట్లు కొల్లగొట్టిందా.....??
పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయన నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలానే అనిల్ రావిపూడి తో చేసిన సుప్రీం సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి, తేజ్ కు కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించాయి. ఇక ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన తేజ్ కు, అవి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
ఇక ఇటీవల కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రలహరి సినిమా మంచి సక్సెస్ సాధించి, కెరీర్ పరంగా తేజ్ కు బ్రేక్ ని ఇచ్చింది. ఇక కొద్దిరోజల క్రితం మారుతీ దర్శకత్వంలో తేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ ని సంపాదించింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక నిన్నటితో సక్సెస్ఫుల్ గా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్ల షేర్ ని, అలానే ఓవర్ ఆల్ వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల షేర్ ని దక్కించుంది.
ఇక యుఎస్ఏ లో ఇప్పటివరకు తేజ్ నటించిన సినెమాలన్నిటికంటే అత్యధిక కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని మొత్తం వసూలు చేసి, ప్రస్తుతం పూర్తిగా లాభాల బాటలో నడుస్తోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక తమకు ఉన్న అంచనాల ప్రకారం, మరొక పది రోజుల వరకు ఈ సినిమాకు పెద్దగా అడ్డంకులు ఏవి ఉండకపోవచ్చని, దానిని బట్టి ఓవర్ ఆల్ క్లోసింగ్ సమయానికి ఈ సినిమా భారీగా లాభాలను సంపాదించే అవకాశం కనపడుతున్నట్లు వారు చెప్తున్నారు......!!