షాకింగ్ అల వైకుంఠపురములో రీషూట్ అసహనంలో త్రివిక్రమ్ ?

Seetha Sailaja

‘అల వైకుంఠపురములో’ మూవీకి నిడివి సుమారు మూడు గంటలకు పెరిగిపోయిన నేపధ్యంలో ఈ మూవీ నిడివిని ఎలా తగ్గించాలి అన్న విషయమై త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్న విషయానికి సంబంధించి ఇప్పటికే రకరాకాల వార్తలు వచ్చిన విషయం  అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు సెకండ్ హాఫ్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ ఇంకా సాగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికీ ఇలా కొన్ని సీన్స్ షూట్ చేయడానికి గల కారణం ఈ మూవీకి సంబంధించిన నిడివి తగ్గించడానికి అని అంటున్నారు. సినిమా నిడివి తగ్గించినప్పుడు పాత్రల మధ్య కనెక్టివిటి తగ్గిపోతుంది కాబట్టి ఆలోటు కనపడనీయకుండా కొన్ని సీన్స్ ఇప్పుడు మళ్ళీ రీ షూట్ చేసి ఈ మూవీ నిడివిని తగ్గించే ప్లాన్ వేసారు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు ఈ షూటింగ్ సమయంలో ప్రతిరోజు అల్లు అరవింద్ షూటింగ్ స్పాట్ కు వచ్చి త్రివిక్రమ్ తో పాటు కలిసి ఈ షూటింగ్ అయ్యేంత వరకు ఉండటంతో త్రివిక్రమ్ చాల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి తనకు క్రియేటివ్ స్పేస్ దక్కలేదని ప్రతి విషయంలోనూ ఎదో ఒకచోట రాజీ పడవలసి వచ్చిందని త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద మధన పడుతున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈసినిమా విడుదలకు ఇక కేవలం 15 రోజులు మించిలేదు. ఈలోపునే ఈ మూవీ ఫైనల్ కాపీ రెడీ కావడంతో పాటు ఈ మూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు కూడ పూర్తి అయి బయ్యర్ల దగ్గర నుంచి పూర్తి డబ్బులు వచ్చి బిజినెస్ క్లోజ్ కావాలి. ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: