నవ నక్షత్రం అవార్డ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ మాటల వెనుక భయం !
కాలం ఎవరిని ఎప్పుడు కరుణించి హీరోలను చేస్తుందో ఎవరికి అంతుచిక్కని రహస్యం. అయితే ఆ కాలంతో పరుగులు తీస్తూ విజయం సాధించాలని ఎందరో తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలలో కొద్దిమంది మాత్రమే విజయం సాదిస్తారు. ‘పెళ్లిచూపులు’ మూవీతో విజయ్ క్రేజ్ ఏర్పడి ‘అర్జున్ రెడ్డి’ తో అతడి క్రేజ్ తారా స్థాయికి చేరిపోయి క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఈమధ్య కాలంలో విజయ్ కు ఫ్లాప్ లు వస్తున్నా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనితో వచ్చే ఏడాది ఇతడు నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూరీ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఫైటర్’ మూవీల ఫలితం బట్టి విజయ్ టాప్ హీరోల లిస్టులోకి చేరతాడా లేదా అన్న విషయం వచ్చే ఏడాది తేలిపోతుంది.
ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన నవ నక్షత్రం అవార్డ్స్ ఫంక్షన్ లో విజయ్ భావోద్వేగానికి గురి అయ్యాడు. మూడున్నర ఏళ్ల క్రితం తన పేరు తన కుటుంబ సభ్యలకు సన్నిహితులకు తప్ప మరి ఎవరకూ తెలియదని అయితే ఇప్పడు తనకు స్టార్ ఇమేజ్ ఏర్పడి తన ఫేవరెట్ సీఎం చేతుల మీదుగా నవ నక్షత్ర పురస్కారాన్ని అందుకోవడం ఒక కలలా మారింది అంటూ విజయ్ భావోద్వేగానికి లోను అయ్యాడు.
ఇదే సందర్భంలో విజయ్ మరో ట్విస్ట్ ఇస్తూ ‘వచ్చే ఏడాది ఏం జరగబోతోందో చూద్దాం’ అంటూ కామెంట్స్ చేసి అందరకు షాక్ ఇచ్చాడు. దీనితో విజయ్ కామెంట్స్ వెనుక ఆంతర్యం ఎంటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు విజయ్ దేవరకొండ పూరి జగనాథ్ మూవీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారబోతున్న పరిస్థితులలో విజయ్ ని ఇలా ఎమోషనల్ చేసిన పరిస్థితులు ఏమిటి అంటూ మరికొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..