ప్రతిరోజూ పండగే: సంక్రాంత్రి సినిమాలా ఉందబ్బా !
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా ఈరోజు విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వినిపిస్తోంది. ప్రతిరోజూ పండగే సినిమాతో సంక్రాంతి పండగ ముందే వచ్చిందని సినిమా సంక్రాంతి పండగ సినిమాలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మారుతీ ఖాతాలో ప్రతిరోజూ పండగే సినిమాతో మరో హిట్ చేరినట్టే అని చెప్పవచ్చు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతోంది. సుప్రీమ్ తో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్లో కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ సీన్స్ లో ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశం బాగుంది. సత్యరాజ్ ఎమోషనల్ గా, ఎనర్జిటిక్ గా అద్భుతమైన నటనను కనబరిచాడు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కుటుంబ కథాంశంతో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ మిస్ కాకుండా సంక్రాంతి పండగ విందుభోజనంలా ప్రతిరోజూ పండగే సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శతమానం భవతి సినిమా తరువాత ఆ సినిమా స్థాయిలో అన్ని అంశాలను సమపాళ్లలో మేళవించి చాలా కాలం తరువాత ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాను అందించారని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కథ, కథనంలో చిన్న చిన్న లోపాలున్నా కీలకమైన ఎమోషన్స్ అద్భుతంగా పండటం, కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమాలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ పోటీ పడి నటించారు. థమన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు విజువల్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతిరోజూ పండగే సినిమాకు పోటీగా విడుదలైన రూలర్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో వీకెండ్ లో ప్రతిరోజూ పండగే సినిమా మెరుగైన కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.