సుప్రీం హీరో ఆశలపై మారుతి నీళ్లు చల్లినట్లేనా.?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో వరుస డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి తో ఒక హిట్టు పొందాడు సాయి ధరంతేజ్. ఇక ఇప్పుడు ప్రతి రోజు పండుగే సినిమా విజయం సాధిస్తే తన కెరీర్ని గాడిలో పెట్టుకొని దూసుకుపోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించగా ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించాడు . గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
అయితే ప్రతి రోజు పండుగ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆశలపై దర్శకుడు మారుతి నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన.. ప్రేక్షకుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కామెడీ సీన్లు 2 ఎమోషనల్ సీన్ లతో సినిమాను మారుతి తెరకెక్కించారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒక పర్ఫామెన్స్ పరంగా ఇంతకుముందు సినిమాల కంటే సుప్రీమ్ హీరో ఇరగదీసినప్పటికీ... టేకింగ్ పరంగా మాత్రం మారుతి తన ఇంతకుముందు సినిమాల మార్కును ప్రతి రోజు పండుగే సినిమా లో చూపించలేక పోయాడు. దీంతో ఈ సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగున్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం అనవసరమైన ఎమోషనల్ సీన్స్ లను దర్శకుడు మారుతి అక్కడక్కడా అతికించినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎమోషనల్ డోస్ కూడా బాగానే పెంచేసాడట మారుతి. ఇక ఎమోషనల్ సీన్ లలో కూడా సాయి ధరంతేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినప్పటికీ.. మారుతి టేకింగ్ మాత్రం కాస్త అభిమానులను నిరాశ పరుస్తుంది. ఈ క్రమంలో గతంలో బలే బలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి సినిమాలు తీసిన మారుతి... ప్రతి రోజు పండగే సినిమా విషయంలో మాత్రం అంత శ్రద్ధ చూపలేనట్లు కనిపిస్తోంది. దీంతో పర్ఫామెన్స్ పరంగా సాయిధరమ్తేజ్ తన సత్తా చాటుకున్నప్పటికీ... టేకింగ్ పరంగా మాత్రం దర్శకుడు మారుతి సాయి ధరంతేజ్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.