హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020 : వెండి తెరపైనా, బుల్లితెరపైనా శ్యాంప్రసాద్రెడ్డిదే హవా !

frame హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010-2020 : వెండి తెరపైనా, బుల్లితెరపైనా శ్యాంప్రసాద్రెడ్డిదే హవా !

praveen

టాలీవుడ్ లో బుల్లి తెరపై.. వెండి తెరపై  మోస్ట్ సక్సెస్ఫుల్  ప్రొడ్యూసర్ గా  దూసుకుపోతున్న దర్శకనిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. నాటి కాలం ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి కుమారుడే శ్యాం ప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై వెండితెర పై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న  ప్రొడ్యూసర్ ఎవరు అంటే శ్యాం ప్రసాద్ పేరు చెప్పడంలో  అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి. సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తలంబ్రాలు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ప్రొడ్యూసర్గా అడుగుపెట్టారు శ్యాంప్రసాద్రెడ్డి. ఇక ఆయన మొదటి సినిమానే సంచలన విజయం సాధించడంతో.. ప్రొడ్యూసర్ గా ఆయనకు మంచి బాటలు పడ్డాయి. వెండితెర ప్రేక్షకులనే  కాదు...తన  వినూత్న ఆలోచనలతో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తూస్తున్నారు శ్యామ్ ప్రసాద్  రెడ్డి. 

 

 

 నాటి తలంబ్రాలు సినిమా నుంచి నేటి అరుంధతి సినిమా వరకు శ్యాంప్రసాద్రెడ్డి విజయ పరంపర కొనసాగింది. శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రోగ్రాం కి కానీ సినిమాకి కానీ ప్రొడ్యూసర్ గా మారాడు అంటే ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రేక్షకుల నమ్మకం. ప్రస్తుతం అటు బుల్లితెరపై కూడా ఎన్నో వినూత్న ఆలోచనలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రోగ్రామ్ సృష్టిస్తున్నాడు ప్రొడ్యూసర్  శ్యాంప్రసాద్ రెడ్డి. ఎన్నో  వినూత్న టెలివిజన్ ప్రోగ్రాం లకి రూపకర్తగా మారిపోయారు ప్రొడ్యూసర్  శ్యాంప్రసాద్ రెడ్డి. 

 

 

 

 శ్యాం ప్రసాద్ రెడ్డి ఎక్కువగా ప్రొడ్యూసర్  గా ఉన్న కార్యక్రమాలు ఈటీవీలో ప్రసారం అవుతున్నాయి. ఒకప్పుడు రామోజీరావు ఇచ్చిన సలహా తోనే శ్యాంప్రసాద్రెడ్డి ప్రొడ్యూసర్గా చిత్రపరిశ్రమకు ప్రవేశించారు. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ని  ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి రూపకర్తగా  ఉన్నారు. ప్రస్తుతం ఢీ షో  టాప్ రేటింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే.. జీన్స్ అదుర్స్ వీర వంటి ప్రోగ్రామ్లను కూడా ప్రొడ్యూస్  చేసాడు శ్యాంప్రసాద్ రెడ్డి. ఇంటి పేరుతో మల్లెమాల అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రోగ్రాం లను నిర్మించారు ఆయన. ప్రస్తుతం ఈ టీవీ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న క్యాష్, స్టార్ మహిళ, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలకు  కూడా శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్స్ గా మారిపోయాడు. ఇటు బుల్లితెర పైనే కాదు వెండితెరపై ఆయన కూడా తన సత్తా చాటుకున్నాడు ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: