అత్త’ కి కథలు నచ్చట్లేదట

Narayana Molleti
మిర్చి సినిమాతో ప్రభాస్ అమ్మగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి హాట్ హీరోయిన్ నదియా. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించి టాలీవుడ్ కలెషన్స్ ని దాదాపు 100 క్రోర్స్ టచ్ చేసేలా చేసిన అత్తారింటికి దారేది సినిమాలో అత్తగా నటించి మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది. తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో నదియా దగ్గరకు చాలా మంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలో నటించేలా చేయాలని డేట్స్ కోసం తిరుగుతున్నారట. కాని ఇవ్వక ఇవ్వక ఎంట్రీ ఇచ్చి మంచి ఫాం లో ఉన్న ఈ సొగసరి అత్తకి కథలు నచ్చట్లేదట. మంచి కథలైతెనే నేను నటిస్తానని తన దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్స్ కి.. డైరక్టర్స్ కి చెబుతుందట నదియా. కాని ఇప్పటికే హీరోకి నచ్చేట్టుగా, హీరోయిన్ కి నచ్చేట్టుగా కథలో మార్పులు చేర్పులు చేసే డైరక్టర్లు.. రైటర్లు.. ఇక నుండి నదియా గురించి కూడా కథలో మార్పులు చేయాలట. ఈ అత్తని సినిమా అని కదిలిస్తే చాలు కథ.. కథ..ఏంటి అని అడుగుతుందట.సో మొత్తానికి ఇచ్చిన హిట్ క్రేజ్ పోకుండా కాపాడుకోవడం కోసం నదియా ఇబ్బందులే పడుతుందని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే నదియా ఏ సినిమా ఎనౌన్స్ చేయలేదు అంటే ఇప్పటి వరకు చెప్పిన డైరక్టర్స్ అందరికీ నో చెప్పినట్లే లెక్క. సో చూద్దాం ఇంత జాగ్రత్తపడుతున్న నదియా నెక్ష్ట్ ప్రోజెక్ట్ ఏం సెలెక్ట్ చేస్తుందో అని ఫిల్మ్ వర్గాలు కూడా వెయిట్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: