కమెడియన్ హీరో సునీల్ నటించిన ‘భీమవరం బుల్లోడు’ సినిమా ఆడియో వేడుకలో చివరన సునీల్ చేసిన ఉపన్యాసంలో వేసిన సెటైర్లు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. నిన్న సాయంత్రం భీమవరంలో జరిగిన ఆడియో వేడుకకు విపరీతంగా జనం రావడం జరిగింది.
అంత విపరీతంగా వచ్చిన ఆ జనాన్ని చూసి ఆనందంలో సునీల్ మాట్లాడుతూ ఈ ఆడియో ఫంక్షన్ ఒక శతదినోత్సవ సభలా తనకు కనబడుతోందని తాను ఇందాస్త్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా, తనకంటూ ఒక అభిమాన సంఘం లేదని అంటు తనకన్నా వెనుక వచ్చిన హీరోలకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయని అన్నాడు సునీల్. అంతేకాకుండా ఇంతమంది జనాన్ని చూస్తుంటే టాలీవుడ్ లోని అందరి హీరోల అభిమానులు తనకోసం వచ్చారా అని అనిపిస్తోందని సునీల్ చేసిన వ్యాఖ్యలు నేటి హీరోల అభిమాన సంఘాలపై వేసిన సేతైర్లుగా విమర్శకులు విశ్లేషణలు చేస్తున్నారు.
అంతేకాదు కెరియర్ విషయంలో ఇప్పటికే చాల వెనకబడి ఉన్న సునీల్ ఈ కామెంట్లు ఎందుకు చేసాడు అనే మాటలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో ఒక సినిమా అభిమాని సురేష్ అనబడే ఒక యువకుడు తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టం అనుకోవాలి మరి ఈ అభిమాని కుటుంబానికి నిర్మాతలు కానీ, లేదా సునీల్ కాని ఏమైనా సాయం చేస్తాడా లేదా అనే విషయం చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: