సూపర్‌ స్టార్‌ రజనీకాంత్  బర్త్ డే స్పెషల్...

Suma Kallamadi

సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన వెండితెర దైవం రజినీకాంత్. చూపు తిప్పుకోనివ్వని అందం, వంద మందినైనా ఎదిరిస్తాడనే నమ్మకము. స్థాయి బాడీ లేకపోయినా ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న ఇమేజ్‌ ఒక్క రజనీకాంత్ కే సొంతం అనే చెప్పాలి. ఆయనే స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్‌ సూపర్‌.

 

 

రజినీకాంత్ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న సినిమా నటుడు. దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు. ఎవరు అంటే రజనీకాంత్. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించడం జరిగింది. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటక, రాష్ట్రంలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. కొంతకాలం తర్వాత ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న టువంటి నటుడు ఈయన తెలుగులో తీసిన సినిమాలు అరుణాచలం, ముత్తు, రోబో, నరసింహ, శివాజీ, మొదలగు సినిమాలు మొదలగు సినిమాలు చాలా పేరు ప్రఖ్యాతులు తన సొంతం చేసుకున్నాడు.

 

 

భారతీయ సినీ ప్రపంచంలో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నటువంటి ఇంటర్‌నేషనల్‌ స్టార్‌ రజనీకాంత్ గారు మాత్రమే.. బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని మొదలు పెట్టాడు. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసే స్థాయికి ఎదిగిన రజనీ కాంత్ జీవితం.. ఓ ఇన్సిపిరేషనల్‌ స్టోరి అని చెప్పవచ్చును.. నెగెటివ్‌ రోల్స్‌తో సినీ ప్రయాణాన్ని మొదట ప్రారంభించాడు రజనీకాంత్‌. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌, స్టైల్‌ హీరో క్యారెక్టర్స్‌ కూడా రజనీకాంత్ ను వెతుక్కుంటూ వచ్చేలా చేశాయి. అయితే ఇవన్నీ అంత ఈజీగా ఏం రాలేదు. ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. దాని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి , పట్టుదల ఉంది.

 

 

ఆయన  తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేసేవారు, తల్లి జిజీబాయ్. చిన్నతనంలోనే రజినీకాంత్ తన తల్లి గారిని  గొట్టుకున్నారు. అయిదేళ్ళ వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు రజనీకాంత్ చిన్నప్పట్నుంచే అనేక ఆటుపోట్లను, ఎన్నో సమస్యలను, ఎదుర్కొన్నాడు. బెంగుళూరులోని రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన రజనీకాంత్ హైస్కూల్‌లో చేరలేదు ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా. 

 

 

బాలచందర్ నుంచి వచ్చిన పిలుపు రజనీ జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తమిళంలో అవర్ ఒరు తోడర్ కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలలో రజనీ పోషించిన పాత్ర సూపర్ హిట్ అనిపించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టయిల్ ప్రేక్షకులను ఎంతగానో విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత విలన్, హీరో అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు రజనీ కాంత్. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా తొందరలోనే రాబోతున్నారు అనటంలో ఏ మాత్రము సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: