సౌత్ నుంచి ఆ ఫీట్ ను అందుకున్న హీరోలు వీరిద్దరేనట.. ఎవరంటే..

Satvika

ఒకప్పుడు సినిమాలకు మాత్రమే అమితమైన అభిమానులు ఉండేవారు ఇప్పుడు మాత్రం హీరోల కోసం పది చచ్చేంత పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు..అభిమానులను హీరోలు కలుసుకునేవారు. అభిమానులను ఉద్దేశించి హీరోలు మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. 

 

సోషల్ మీడియా పుణ్యమా అని హీరోలంతా ప్రతిరోజూ తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బోలెడన్ని విషయాలను వారితో షేర్ చేసుకుంటున్నారు. అయితే, వెండితెరపై ఉన్నట్టే సోషల్ మీడియాలో సైతం హీరోల మధ్య గట్టి పోటీనే ఉంది.మామూలుగా హీరోలు ఎప్పుడు తమ సినిమాల గురించిన్ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు..తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఈ ట్వీట్లను ఆధారంగా చేసుకుని ట్విట్టర్ ఇండియా ప్రతి ఏటా ఒక రిపోర్ట్‌ను విడుదల చేస్తోంది.


అయితే ఈ ఏడాదికి సంబంధించిన రిపోర్ట్ ను తాజాగా మంగళ వారం ప్రకటించింది..అయితే ఎంటర్‌టైన్మెంట్ విభాగం నుంచి 2019లో దేశంలో అత్యధిక ట్వీట్లు చేసిన నటులు, నటీమణుల టాప్ 10 ట్విట్టర్ హ్యాండిల్స్‌ను పేర్కొంది.‘‘టాప్ ఎంటర్‌టైన్మెంట్ హ్యాండిల్స్ ఇన్ ఇండియా - మేల్’’ కేటగిరీలో సౌత్ నుంచి నలుగురు సెలబ్రిటీలు స్థానం సంపాదించుకున్నారు. 

 

ఆ నలుగురు.. విషయానికొస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్, సంగీత దిగ్గజం ఎ.ఆర్.రెహమాన్, దర్శకుడు అట్లీ. విజయ్ ఐదో స్థానంలో ఉండగా.. మహేష్ బాబు తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక రెహమాన్ ఆరో స్థానం, అట్లీ పదో స్థానాన్ని ఆక్రమించారు. ఈ చార్ట్ నమూనాలో అమితా బచ్చన్ మొదటి స్థానంలో ఉండగా,సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం..టాప్ ఎంటర్‌టైన్మెంట్ హ్యాండిల్స్ ఇన్ ఇండియా - ఫీమేల్’’ కేటగిరీలో సౌత్ నుంచి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ స్థానం దక్కించుకున్నారు. కాజల్ ఏడో స్థానంలో, రకుల్ 10వ స్థానంలో ఉన్నారు. ఈ కేటగిరీలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాది అగ్రస్థానం. అనుష్క శర్మ, లతా మంగేష్కర్, అర్చన కల్పతి, ప్రియాంక చోప్రా, అలియా భట్, సన్నీ లియోన్ తదితరులు ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: