స్నేహితుడి కోసం త్యాగం చేస్తున్న పవన్!

Seetha Sailaja
పవన్ కెరియర్ లో ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ -2’ సీక్వెల్ స్క్రిప్ట్ తయారుకు తీసుకుంటున్న ఆలస్యం గతంలో పవన్ నటించిన ఏ సినిమాకు తీసుకోలేదని విశ్లేషకులు అంటున్నారు. గతంలో పవన్ నటించిన ‘పంజా’, ‘అత్తారిల్లు’ సినిమాల స్క్రిప్ట్ రచన కూడా ఆలస్యం అయినా ప్రస్తుతం నడుస్తున్న ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ అంత ఆలస్యం కాదు అని అంటున్నారు. ఇలా జరగడానికి గల కారణాల ఫై ఒక ఆశక్తికర కధనం వినపడుతోంది. ఈ సినిమా నిర్మిస్తున్న శరత్ మరార్ పవన్ కు చాలా సన్నిహిత మిత్రుడు. గతంలో పవన్ దర్శకత్వ్యం వహించి నటించిన ‘జానీ’ సినిమాకు ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శరత్ మరార్ ఆసినిమా పరాజయం వల్ల బాగా నష్టపోయాడు. ఆ సందర్భం లో పవన్ అతడికి భవిష్యత్ లో లాభాలు వచ్చేటట్టుగా ఒక మంచి సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మైగాడ్’ సినిమాను శరత్ మరార్ పవన్ తో తీయడానికి 4 కోట్లు పెట్టి రీమేక్ రైట్స్ కొంటున్నప్పుడు పవన్ వద్దని వారించి తన మనసులో ఉన్న ‘గబ్బర్ సింగ్ సీక్వెల్’ ఆలోచన చెప్పాడట. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ దర్శకుడు సంపత్ నంది తన ఆలోచన ప్రకారం మలచ లేక పోవడంతో స్వయంగా పవన్ తన స్నేహుతిడి కోసం పెన్ పట్టుకుని స్క్రిప్ట్ రచన చేయడమే కాకుండా ఈ సినిమా నిర్మాణ విషయంలో ఒక్క పొరపాటు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాడట.  ఈ పరిస్థితుల నడుమ ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్పొరేట్ నిర్మాణ సంస్థలు పవన్ కు దాదాపు 20-25 కోట్ల భారీ ఆఫర్స్ ఇస్తున్నా డబ్బుగురింఛి ఆ కార్పొరేట్ సినిమాల కధలు వినడం మొదలు పెడితే తన స్నేహితుడికి అన్యాయం చేసిన వాడుని అవుతానని ‘గబ్బర్ సింగ్ -2’ సీక్వెల్ అయ్యేదాకా కోట్లు వస్తున్నా ఒక్క అగ్రిమెంట్ ఫై సంతకం చేయకుండా స్నేహితుడి కోసం పవన్ త్యాగం చేస్తున్నాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: