రిలీజ్ కొంచెం లేట్.. కిక్ మాత్రం మారదు...
ఆర్‌ఎక్స్ 100 సినిమా ఫేం కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 90 ఎంఎల్. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసిన కూడా ఈ సినిమా హిట్ అయినంత హిట్ కాలేదు. ఆ సినిమాలలో కూడా బోల్డ్నెస్ పెంచిన కూడా బాబుకు హిట్ అందని ద్రాక్షలా మారింది.. మరోసారి బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కార్తికేయ. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడు. ఈ సినిమాను కార్తికేయ హోం బ్యానర్‌లో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ రావటంలో ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడిందని వెల్లడించాడు హీరో కార్తికేయ. అంతే ఈ సినిమాలో సెన్సార్ కట్స్ చాలానే ఉండటంతో ఈ సినిమా సీన్స్ కట్స్ చేయాలనీ సెన్సార్ అంది దానితో.. ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో డేట్ మారినా కిక్ మారడంతో హీరో అనడం విశేషం..
ఇకపోతే ఒక్కరోజు ఆలస్యమైన కిక్ మాత్రం తగ్గదంటూ భరోసా ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. మంగళవారం సాయంత్రానికి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. కాస్త బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ కమిటీ. మరి సినిమా విడుదల లో కొంచం లేట్ అయిన కూడా సినిమాలో కిక్ మారడంతో హీరో అనడం విశేషం..
ఈ సినిమాలో కార్తికేయ ఆథరైజ్డ్ డ్రింకర్‌గా నటిస్తున్నాడు. తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా మూడు పూటలా 90 ఎంఎల్ ఆల్కాహాల్ తీసుకునే పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కార్తికేయ ఖాతాలో మరో హిట్‌గా నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు చిత్రయూనిట్.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం మాత్రం ఇక్కడ తెలియడం లేదు ... త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అంటున్నారు..