
మహేష్ బన్నీల పేరు చెపితే బెదిరిపోతున్న నిర్మాతలు !
ప్రస్తుతం టాప్ హీరోలు సంవత్సరానికి ఒకసినిమా చేయడమే అతికష్టంగా మారుతోంది. ఒక టాప్ హీరోకి కథ చెప్పి ఒప్పించాలి అంటే దర్శకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే టాప్ హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ తో పాటు ఆమూవీలకు జరిగే బిజినెస్ సాధారణ హీరోల సినిమాలకు జరగదు కాబట్టి ఇప్పటికీ చాలామంది నిర్మాతలు టాప్ హీరోలతో సినిమాలు తీయడం కష్టం అని తెలిసినా రిస్క్ చేసి అధిక లాభాలను ఆశించి టాప్ హీరోల వెనక పడుతున్నారు.
దీనితో టాప్ హీరోలు అంతా తాము ఒక అద్భుత వ్యక్తులం అనే మైండ్ సెట్ లోకి వెళ్లిపోయి తమ వద్దకు వచ్చే దర్శక నిర్మాతలతో మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలకు అసలు చివరికి లాభాలు మిగులుతాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ‘అల వైకుంఠపురములో’ మూవీలో నటించినందుకు బన్నీకి 25 కోట్లు పారితోషికం అందినట్లు టాక్. ఇది కాకుండా ఈ మూవీకి సహ నిర్మాతగ వ్యవహరించిన అల్లు అరవింద్ కు లాభాలలో కూడ వాటా అడిగినట్లు తెలుస్తోంది. ఇలా ఒప్పుకోవడం ఈమూవీ నిర్మాతలకు పూర్తిగా ఇష్టం లేకపోయినా బన్నీ మ్యానియాలో పడి అన్ని టర్మ్స్ కు ఒప్పుకున్నట్లు టాక్. అదేవిధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించి మహేష్ నాన్ ధియేట్రికల్ రైట్స్ పారితోషికంగా అడిగి తిరిగి ఈమూవీకి వచ్చే లాభాలలో వాటా అడిగినట్లు టాక్.
అయితే పారితోషిక విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండే టాప్ హీరోలు వారు నటించిన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు బయ్యర్లకు ఆ సినిమా నిర్మాతలు నష్టపరిహారాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు కనీసం తమతో సినిమాలను తీసి నష్టపోయిన నిర్మాతల గోడు కూడ వినడటం లేదు అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగితున్న టాప్ హీరోల ఆది పత్యం పై నిర్మాతలు బయటకు చెప్పుకోలేని అసహనంలో ఉన్నారు కామెంట్స్ వస్తున్నాయి..