ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమాలు హ్యాండ్ ఇస్తున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం మెప్పిస్తున్నాయి. అవి కూడా స్ట్రైట్ మూవీస్ కాదు. మరి రెండు నెలలుగా హిట్ అయిన సినిమాలు మనవి కావు.
తెలుగులో డబ్బింగ్ సిిమాల హవా మళ్లీ మొదలైంది. ఈ ఏడాది రిలీజైన రజనీకాంత్.. విక్రమ్.. సూర్య.. అజిత్ వంటి పెద్ద హీరోల సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. అనువాదాలకు 2019 కలిసిరావడం లేదనుకుంటే.. చివర్లో వచ్చిన చిత్రాలు మెప్పించడం మొదలుపెట్టాయి. హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన "వార్" డబ్బింగ్ సినిమాలకు ఊపిరిపోసింది.
ఈ దీపావళికి తెలుగులో స్ట్రైట్ మూవీ ఒక్కటీ రిలీజ్ కాకపోయినా.. ఆ లోటును తమిళ అనువాదాలు విజిల్.. ఖైదీ భర్తీ చేశాయి. ఒకే రోజు వచ్చినా.. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ ను ఆకట్టుకోవడం విశేషం. విజయ్ "అదిరింది" సినిమాతో తెలుగులో తొలిసక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సర్కార్ తో మరో సక్సెస్ చూడటంతో.. బిగిల్ తెలుగులో 10కోట్ల బిజినెస్ చేసింది. అరవ తాలింపు ఎక్కువైనా.. దర్శకుడు అట్లీ సెకండాఫ్ ను ఎమోషన్ గా నడిపించి తెలుగు బాక్సాఫీస్ వద్ద 11కోట్లు కలెక్ట్ చేశాడు.
విజిల్ తో పాటు వచ్చి ఖైదీ కపూర ఓపెనింగ్స్ తో మొదలైనా.. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ బలమైన మౌత్ టాక్ గా మారింది. ఆ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ విజిల్ ను ఓవర్ టేక్ చేసి డిస్ట్రిబ్యూటర్ కు భారీ లాభాలు తీసుకొచ్చింది. ఆద్యంతం థ్రిల్లింగ్ గా తెరకెక్కిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుమారుమోగిపోయింది. సినిమాను నాలుగున్నర కోట్లకు కొంటే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది.
డబ్బింగ్ మూవీస్ సక్సెస్ పరంపరను యాక్షన్ కొనసాగించింది. రీసెంట్ గా రిలీజైన విశాల్ మూవీ యాక్షన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కుటుంబ కథకు ఇంటర్నేషనల్ సమస్య టెర్రరిజాన్ని జోడించి థ్రిల్లింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు సుందర్. విశాల్ కెరీర్ లో భారీ బడ్జెట్ 55కోట్లతో తెరకెక్కి ఈ చిత్రం పెట్టుబడి రాబడుతుందో లేదో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.