సాధారణంగా ఫిలిం సెలెబ్రెటీలు జనం మధ్యకు వచ్చినప్పుడు ఎక్కువగా సన్ గ్లాసస్ పెట్టుకుని వస్తూ ఉంటారు. వారి కళ్ళలోని భావాలు ఎదుటివారికి తెలియకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని ఒక అభిప్రాయం ఉంది.
అయితే ఈమధ్య అమెరికాలో అత్యంత ఘనంగా జరిగిన కోనేరు ఫ్యామిలీ పెళ్ళి ఫంక్షన్ కోసం చిరంజీవి వెంకటేష్ లు ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి అమెరికా వెళ్ళడం ఒక హాట్ న్యూస్ గా మారింది. ఎంతోమంది అమెరికాలోని ప్రముఖ ఎన్ఆర్ఐ లు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్న ఆపెళ్ళి కార్యక్రమం డిన్నర్ అన్నీ కూడ ఒకప్రముఖ ఫంక్షన్ హాల్ లో అత్యంత ఘనంగా పెళ్ళి వేడుకలు జరిగాయి.
అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన వెంకటేష్ చిరంజీవిలు ఇండోర్ ఆడిటోరియంలో జరిగిన ఆకార్యక్రమంలో మొదటి నుండి చివరి వరకు కళ్ళకు సన్ గ్లాసస్ కనీసం ఒక్క క్షణం కూడ ఆసన్ గ్లాసస్ తీయకుండా కనిపించారట. ఆ పెళ్ళికి వచ్చిన కొంతమంది ఎన్ఆర్ఐ లు చిరంజీవి వెంకటేష్ ల సన్ గ్లాసస్ మోజు ఏమిటి అంటూ జోక్ చేసుకున్నట్లు టాక్.
అయితే మరికొందరు మాత్రం మరొక విధంగా జోక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి 65 సంవత్సరాలు వెంకటేష్ 60 సంవత్సరాల దగ్గరకు రావడంతో వారి కళ్ళ కింద ఏర్పడిన నల్లచారాలను అదేవిధంగా ముఖంలోని ముడతలను కవర్ చేయడానికి తాపత్రయం పడుతూ ఇలా సన్ గ్లాసస్ తో కవర్ చేసుకుంటున్నారు అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు ఉన్నాయి. అందుకే కాబోలు వీరిద్దరి సినిమాలకు సంబంధించి క్లోజప్ షాట్స్ లో వీరి ముఖంలోని ముడతలు కనిపించకుండా విఎఫెక్స్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ భారీగా నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు అన్నవార్తలు ఉన్నాయి. వీరి సినిమాలకు భారీ పారితోషికాలే కాదు వీరి సినిమాలకు సంబంధించిన విఎఫెక్స్ సాఫ్ట్ వేర్ ఖర్చులు కూడ బాగా పెరిగిపోతున్నాయి అన్న జోక్స్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి..