ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన దేవిశ్రీ

Suma Kallamadi
అల వైకుంఠపురము, సరిలేరు నీకెవ్వరూ ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి భారీ సినిమాలుగా ధియేటర్లపైకి దండెత్తనున్న విషయం తెలిసిందే   దాదాపు ఈ  రెండు సినిమాలు ఒకే సమయంలో  విడుదలవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.  సంక్రాంతి సమరంలో బన్నీ, ప్రిన్స్‌ల చిత్రాలు తలపడటంతో రెండు సినిమాలు ప్రేక్షకాభిమానులను అలరించేందుకు సిని  మేకర్లు శ్రమిస్తున్నారు.

  అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ నిర్ధేశకత్వంలో రాబోతుంది  ఈ  చిత్రం నుంచి   ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా మహా అద్భుతంగా  అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఎస్‌ థమన్‌ అల వైకుంఠపురముకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసారు. తొలి పాటగా సామజవరగమనను సెప్టెంబర్‌ 27న  విడుదల చేయగా 7.7 కోట్ల వ్యూస్‌ రావడంతో ఈ  సాంగ్  బెస్ట్‌ మెలడీగా నిలిచింది.


 ఇక మరో నెల రోజుల తర్వాత దీపావళి కానుకగా రాములో రాములా అనే  పాటను  అక్టోబర్‌ 27న  చిత్ర బృందం విడుదల చేయగా యూట్యూబ్‌లో ఇప్పటికే 4.3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ చిత్రం లోని రెండు పాటలు ప్రేక్షకులని బాగా  ఆకట్టుకునే విధంగా వున్నాయి. రెండు  పాటలు ప్రేక్షకాదరణను పొందడం సరిలేరు నీకెవ్వరు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై ఒత్తిడి పెంచుతోంది. అల వైకుంఠపురములో పాటలను మించి క్యాచీ ట్యూన్స్‌ను ఇచ్చేందుకు దేవి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు. దేవిశ్రీని కనీసం రెండు హిట్‌ పాటలైనా ఇవ్వాలని చిత్ర బృందం  కోరుతున్నట్టు తెలిసింది.


దీనికి దగ్గట్టు ఇక దేవిశ్రీ ఇప్పటికే సామజవరగమనకకు దీటైన మెలొడీని కంపోజ్‌ చేశారని సరిలేరు..బృందం త్వరలోనే దీన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ పాట సామజవరగమన, రాములో రాములా సృష్టించిన మేనియాను తిరగరాస్తుందా అన్నది వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: