అందరు అనుకున్నట్టే బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలుచుకున్న రాహుల్..!
దీంతో ఫైనల్ విజేతను ప్రకటించేందుకు చిరంజీవి రావడంతో వేదిక మొత్తం సందడి వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో విజేతలు ప్రకటించే ప్రక్రియ ప్రారంభం కావడంతో వేదికను వదిలి నాగార్జున ఇంటి లోకి వెళ్లి చివరిగా మిగిలిన శ్రీముఖి రాహుల్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. విన్నర్ ఫ్రైజ్ మని 50 లక్షలు. మీరిద్దరూ కాంప్రమైజ్ అయితే చెరో 25 లక్షలు సమానంగా పంచుకోవచ్చు. విజేతని ప్రకటిస్తే ఒకరు తప్పకుండా రన్నర్ అయిపోతారు. ఆలోచించుకోండి అని ఆఫర్ ఇచ్చాడు. కానీ శ్రీముఖి, రాహుల్ ఇద్దరూ నాగ్ ఇచ్చిన ఆఫర్ ని అంగీకరించలేదు. దీనితో వారిద్దరిని తీసుకుని నాగ్ వేదికపైకి వెళ్లారు.
ఈ క్రమంలో అతిథిగా వచ్చిన చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున యాంకరింగ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా షో ఇంతటి సక్సెస్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ విన్నర్ ప్రకటించే సమయం ఆసన్నం అవటంతో శ్రీముఖి, రాహుల్ చేతులని నాగ్ పట్టుకున్నారు. ఒక్కసారిగా రాహుల్ చేయి పైకి ఎత్తి విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో బిగ్ బాస్ 3 టైటిల్ విజేతగా రాహుల్ నిలిచాడు. శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. దీంతో టైటిల్ గెలుచుకున్న రాహుల్ కి మెగాస్టార్ చిరంజీవి ట్రోఫీ అందించారు.