షారుక్ పుట్టినరోజు సందర్బంగా షాకింగ్ సంఘటనలు

Suma Kallamadi
బాలీవుడ్ లో  కింగ్ ఆఫ్ బాలీవుడ్, బాద్‌షా షారుక్ ఖాన్ ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.గత 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో స్టార్‌డంను కొనసాగిస్తున్న షారుక్ తన జీవితంలో చోటుచేసుకున్న షాకింగ్, ఫన్నీగా సందర్భాలను తన అభిమానులతో పంచుకోవడం జరిగింది. షారుక్ ఖాన్ ఇలా మాట్లాడుతూ..  ‘ఓసారి నేను కారులో ఓ ప్రదేశానికి బయలుదేరాను. ఆ ప్రదేశం ఏంటో నేను చెప్పను. ఎందుకంటే అక్కడ నేను ఓ ఖరీదైన దొంగతనం చేయడం జరిగింది.

అన్ని వివరాలు బయటపెడితే నన్నుకచ్చితంగా పట్టుకుంటారు. కారులో వెళుతున్నప్పుడు కారు టైర్ పంచర్ అయంది. దాంతో ఏం చేయాలో తెలియక  దగ్గర్లో ఓ కారు పార్క్ చేసి ఉంది. అ కారు కూడా  నాలాంటి కారే. ఎవ్వరూ లేరు కదా అని టైరు దొంగలించాను అని తెలిపాడు.


‘ఆ టైరుని కారుకి పెడుతుంటే రెండో టైర్‌ కూడా పంచర్ కావడం జరిగింది . ఇక చేసేదేంలేక అదే కారు నుంచి మరో టైర్‌ను కూడా దొంగిలించాను. నా కారుకు టైర్లు ఫిక్స్ చేసి పంచర్ ఐనా నా కారు టైర్లను ఆ కారుకి పెట్టేసి వెళ్లిపోయాను. దాంతో చూసేవారికి కారు టైరు పంక్చర్ అవ్వడం వల్ల వదిలేసి వెళ్లిపోయారు అనుకుంటారని అనే భావనతో నేను ఆ పని చేసాను. కానీ ఇలా చేయడం తప్పు అని తెలుసు. ఆ తర్వాత ఎప్పుడు అలాంటి తప్పులు చేయలేదు’ అని తెలియచేసాడు షారుక్.


షారుక్ బర్త్‌డే సందర్భంగా ఎందరో అభిమానులు ముంబయిలోని మన్నత్ (షారుక్ ఇంటి పేరు) వద్ద బారులు తీరారు. షారుక్ కోసం ఎన్నో గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. వారందరికీ థ్యాంక్స్ చెప్పడానికి షారుక్ ఇంటి బయటికి వచ్చి సందడి కూడా చేశాడు. ఇక షారుక్  వర్క్ విషయానికొస్తే.. ‘జీరో’ సినిమా ఫ్లాపవడంతో భారీ షాక్ తగిలింది. తేరుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది అనే చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, షారుక్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు ‘సాంకీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: