మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి గారు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచి మాస్ మరియు కమర్షియల్ హంగులతో ఆకట్టుకునే కామెడీ అంశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తుండగా,
రత్నవేలు కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ మరియు పోస్టర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్ కార్యక్రమాలు అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్న సినిమా యూనిట్, తొలుత సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతోందట. ఇది నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా టీజర్ ని నవంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది.
నిజానికి అంతకంటే ముందే టీజర్ ని రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, కొన్ని టెక్నీకల్ సమస్యల కారణంగా టీజర్ కొంత ఆలస్యం అవుతుండడంతో 23వ తేదీని ఫైనల్ గా ఫిక్స్ చేశారట. ఇక టీజర్ రిలీజ్ తరువాత సినిమా ఎలా ఉండబోతోంది అనేది ప్రేక్షకులకు చాలా వరకు అర్ధం అవుతుందని, ఒక కామెడీ సీన్ తో పాటు పవర్ఫుల్ ఫైట్ కూడా టీజర్ లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పండుగ వార్త అయినట్లే....!!