‘సైరా’ ‘సాహో’ ల ఫలితం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ యాక్షన్ ప్లాన్ పై విపరీతంగా ప్రభావం చూపెట్టబోతోందా అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూల కథలో చాలమార్పులు జరుగుతున్న నేపధ్యంలో ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాదనీ అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే 2021 సంక్రాంతికి ఈమూవీ విడుదల అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
అందువల్లనే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రాజమౌళి పుట్టినరోజునాడు విడుదల చేయాలని ముందుగా అనుకుని ఆ తరువాత ఆలోచనలు మారిపోయాయి అని అంటున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ నిజ జీవితాల ప్రభావంతో ముందుగా అనుకున్న కథలో రాజమౌళి చాల మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి మొదట్లో ఈమూవీలో మరో కీలక పాత్ర చేస్తున్న అజయ్ దేవగన్ కు పాత్ర పరిధి చిన్నదిగా ఉండేలా కథను డిజైన్ చేసినట్లు టాక్. అయితే ఈమూవీ బడ్జెట్ దాదాపు 400 కోట్లు దాటిపోతున్న పరిస్థితులలో ఈమూవీలో అజయ్ దేవగన్ పాత్రను పెంచడమే కాకుండా ఇతడి పాత్రతో పాటు అలియా భట్ పాత్రను కూడ బాగా పెంచుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అజయ్ దేవగన్ ను రాజమౌళి అతడి పాత్రకు సంబంధించిన స్కెచ్ లు చూపెట్టి అతడి పాత్ర బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో పూర్తిగా వివరించినట్లు తెలుస్తోంది.
దీనికితోడు అలియా భట్ పెళ్లి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ముగిసేలోపునే జరిగే అవకాశం ఉండటంతో మరొక సారి ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో కుదిరితే 2021 సంక్రాంతి లేదంటే 2021 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ ఎటువంటి ఖంగారు లేకుండా చిన్న పొరపాటు కూడ రానీయకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ యాక్షన్ ప్లాన్ లో మార్పులు వచ్చాయి అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే జూనియర్ చరణ్ అభిమానులకు వీరు నటించిన ఒక్క సినిమా కూడా లేకపోవడంతో మిగతా హీరోల సినిమాలతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది..