ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ
ఇక ఈసినిమా ను పూర్తి చేశాడో లేదో అప్పుడే రజినీ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. శౌర్యం , శంఖం , దరువు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ ఆ తరువాత కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ తో వరుసగా సినిమాలు చేసి అక్కడ ఫేమస్ అయ్యాడు. వివేగం తరువాత అజిత్ తో చేసిన విశ్వాసం సూపర్ హిట్ కావడంతో శివకు కోలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఇక ఇటీవల రజినీ ని కలిసి శివ కథ వినిపించాడట. రజినీ కి ఆ కథ నచ్చడంతో వెంటనే సినిమా కు ఓకే చెప్పాడట. డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇంతకుముందు సన్ పిక్చర్స్ -రజినీ కాంబినేషన్ లో రోబో , పేట చిత్రాలు తెరకెక్కగా ఈ రెండు సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈమూడో చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.