మెగా అభిమానుల ప్రశ్నలకు కలవరపడుతున్న జూనియర్ !

Seetha Sailaja
చిరంజీవి ‘సైరా’ రెండవ వారంలో ప్రవేశించి కూడ తెలుగు రాష్ట్రాలలో తన హవాను కొనసాగిస్తోంది. రాజకీయ నాయకుల నుండి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అంతా ‘సైరా’ లో నటించిన చిరంజీవిని ప్రశంసిస్తూ ఈరోజుకు కూడ తమ కామెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఒక సమాధానం లేని ప్రశ్న మెగా అభిమానులను వెంటాడుతోంది. చిరంజీవి ‘సైరా’ పై టాప్ యంగ్ హీరోలు అంతా స్పందించారు. అయితే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా ‘సైరా’ గురించి మాట్లాడలేదు. అయితే గతంలో ‘సైరా’ ట్రైలర్ విడుదల అయిన తరువాత చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ జూనియర్ పొగడ్తల వర్షం కురిపించాడు. 

‘సైరా’ విడుదల అయిన తరువాత మాత్రం జూనియర్ మౌన ముద్రలోకి వెళ్ళిపోయాడు. జూనియర్ కు చరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా వీరిద్దరు కలిసి ‘ఆర్ ఆర్ ఆర్’ కలిసి నటిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే జూనియర్ చరణ్ కు తన అభినందనలు తెలియచేసి ఉంటాడు. ఈ అభినందనలను బహిరంగంగా ఎందుకు తెలియచేయలేదు అన్న ప్రశ్న మెగా అభిమానులను వెంటాడుతోంది. ఈ విషయమై మరికొందరు మరొక విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
సైరా’ ను ప్రశంసిస్తూ జూనియర్ బహిరంగంగా ప్రశంసలు కురిపిస్తే గతంలో బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీని చూసి ఎందుకు మాట్లాడలేదు అని బాలయ్య అభిమానులు ప్రశ్నించే ఆస్కారం ఉంది కాబట్టి ఈ అనవసరపు రగడ ఎందుకని జూనియర్ తన ప్రశంసలు చిరంజీవి చరణ్ లకు తెలిపే విషయంలో బహిరంగంగా కాకుండా మరొక మార్గాన్ని ఎంచుకుని ఉంటాడు అంటూ కొందరు జూనియర్ తీరు పై ఊహాగానాలు చేస్తున్నారు. అయితే మెగా అభిమానుల అసహనం జూనియర్ దృష్టి వరకు వెళితే ఈ సున్నిత సమస్యను తారక్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి..    
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: