హాఫ్ సెంచరీ తో అల్ టైం రికార్డు సృష్టించిన వార్
ఇదిలా ఉంటే హిందీ లో వార్ , మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా కు ప్రతికూలంగా మారింది. సుమారు అక్కడ 1200స్క్రీన్ లలో విడుదలైన సైరా మొదటి రోజు కేవలం 2.50కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఈ చిత్రానికి వార్ అడ్డుగోడల నిలవడంతో అంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అలా కాకుండా సైరా అక్కడ కూడా సోలో గా విడుదలైయ్యుంటే ఖచ్చితంగా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టేదే. ఇక సైరా హిందీలో 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒకవేళ కలెక్షన్స్ గనుక ఇలానే ఉంటే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం గ్యారెంటీ. మరి రానున్న రోజుల్లో నైనా ఈ చిత్రం అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తుందో లేదో చూడాలి.