దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీని నడిపించే కీలక శక్తి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాలను భారతీయ సంస్కృతిని శాసిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో అతి త్వరలో విడుదల కాబోతున్న ‘సైరా’ కు ఆర్ఎస్ఎస్ పరోక్షంగా మద్దతు తెలుపుతున్న ఆసక్తికర సంఘటనలు హాట్ టాపిక్ గా మారాయి.
‘
సైరా’ కు దర్శకత్వం వహించిన సురేంద్ర రెడ్డి చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఒక పాఠశాలలో చదువుకున్నాడట. ఆ స్కూల్ లో చదువుకోవడం వలెనే తనకు జాతీయ భావాల ప్రభావం బాగా తన పై పడింది అన్న క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఆ భావాల ప్రభావం తనకు ‘సైరా’ నిర్మాణంలో ఎంతో సహకరించిన విషయాలను వివరించాడు.
ఒకప్పుడు విద్యార్ధులలో జాతీయ భావాలను రేకెత్తించే ఎన్నో మంచి స్కూల్స్ ఉండేవని అయితే ఇప్పుడు విద్య కార్పోరేట్ మయం అయిపోవడంతో విద్యార్దులకు దేశభక్తి గురించి చరిత్ర గురించి చెప్పవలసిన అవసరం ఏర్పడి ‘సైరా’ లాంటి సినిమాలు తీయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్న విషయాలను వివరించాడు. ఇప్పుడు సురేంద్ర రెడ్డి చెప్పిన కామెంట్స్ ఆర్ఎస్ఎస్ క్యాడర్ కు బాగా నచ్చడంతో సురేంద్ర రెడ్డి కామెంట్స్ ను ఆర్ఎస్ఎస్ అభిమానులు తమ ఫేస్ బుక్ వాల్స్ మీద పోస్ట్ చేస్తూ సురేంద్ర రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ సభ్యులు సురేంద్ర రెడ్డి కామెంట్స్ ను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్న నేపధ్యంలో ‘సైరా’ కు వారంతా పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారు అనుకోవాలి. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ స్కూల్స్ లో సీట్లు దొరకాలి అంటే విపరీతమైన డిమాండ్ వల్ల విద్యార్ధులకు సీట్లు దొరికేవి కావు. అయితే ఇప్పుడు కార్పోరేట్ విద్యా సంస్థల మ్యానియాతో బాగా అభ్యుదయ భావాలు ఉన్నవారు కూడ తమ పిల్లలను కార్పోరేట్ స్కూల్స్ కు పంపవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక విధంగా సురేంద్ర రెడ్డి చేసిన కామెంట్స్ అందర్నీ ఆలోచింప చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..