నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫెయిల్ అవ్వడంతో నాని అభిమానులు షాక్ అయ్యారు. ఆ తరువాత వెనువెంటనే వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలక్షన్స్ విషయంలో కూడ మంచి ఫలితాలను కొనసాగిస్తోంది.
ఇలాంటి పరిస్థితులలో ఈ రిజల్ట్ ను చూసి నాని అభిమానులు జోష్ లోకి వెళ్ళడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనికి కారణం నాని లేటెస్ట్ గా నటిస్తున్న అతడి 25వ సినిమా. నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ అన్న మూవీలో నటిస్తున్నాడు. నాని తనకు హీరోగా ఛాన్స్ ఇచ్చి తనకు ఒక కెరియర్ ను ఏర్పరిచిన ఇంద్ర గంటి మోహన్ కృష్ణకు లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశ్యంతో నాని తన 25వ సినిమాను మోహన్ కృష్ణ చేతిలో పెట్టాడు.
ఈ మూవీ కథలో చాల ట్విస్ట్ లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. నాని పాత్ర అంతా చాల నెగిటివ్ కోణంలో ఉంటూ చాల షాకింగ్ గా ఉంటుంది అని అంటున్నారు. దీనితో నాని ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తున్నాడు అంటూ నాని అభిమానులు చాల కలవర పడ్డారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ నెగిటివ్ పాత్రలో నటించి సూపర్ సక్సస్ అందుకోవడంతో అదే లక్ తమ హీరోకి కూడ వస్తుందని నాని అభిమానులు కూడ ఇప్పుడు జోష్ ఉన్నారు.
గతంలో చిరంజీవి బాలకృష్ణ లాంటి టాప్ హీరోలు నెగిటివ్ చాయలు ఉన్న పాత్రలలో నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ సెంటిమెంట్ ను వరుణ్ తేజ్ బ్రేక్ చేయడం అతడి కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. దీనితో నాని కూడ నెగిటివ్ పాత్రలో సక్సస్ కాగలిగితే మన టాప్ హీరోలు అంతా ఇలాంటి పాత్రలను చేయడానికి ముందుకు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..