నిన్న ‘సైరా’ ట్రైలర్ ను లాంచ్ చేస్తూ రామ్ చరణ్ మొట్టమొదటి సారిగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తమపై చేస్తున్న నిరశన కార్యక్రమం పై స్పందించాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదని ఆయన దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి అని చెపుతూ ఈ సినిమా కోసం ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు సాయం చేసి ఆయన గౌరవం తగ్గించే ఆలోచన తనకు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
అయినప్పటికీ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు తమకు చేతనైన సహాయం చేస్తామని చిరంజీవి చెప్పిన మాటలను గుర్తుకు చేస్తూ తాము బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా తీసే విషయంలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అంగీకారానికి సంబంధించిన లీగల్ విషయాల పై స్పందిస్తూ ఒక వ్యక్తి చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఎవరైనా ఆ వ్యక్తి జీవితం గురించి సినిమాలు తీయవచ్చు అంటూ సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తాము ‘సైరా’ తీసిన విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.
‘మంగళ్ పాండే’ బయోపిక్ విషయంలో కూడ ఇదే జరిగిందని వాస్తవాలు తెలియక ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఎదో ఊహించుకుని ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉంది అంటూ చరణ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈ మూవీలో ఉయ్యాలవాడ గౌరవాన్ని పెంచే సీన్స్ మాత్రమే ఉంటాయని అందువల్ల ఈ సినిమాను ముందుగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు చూపించే ప్రశక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
దీనితో ‘సైరా’ మూవీకి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల నుండి లీగల్ సమస్యలు తలేత్తుతాయా అంటూ వస్తున్న వార్తలకు తెరపడినట్లు అయింది. దీనితో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా లేదంటే ఆందోళన చేస్తున్న ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు మరేదైనా లీగల్ పాయింట్ ను పుచ్చుకుని తమ ఆందోళనను కొనసాగిస్తారా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..