గ్యాంగ్ లీడర్ రిజల్ట్ పై నాని భవిష్యత్తు..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ టైటిల్ ను వాడేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ గోల చేసినా. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో మరో సినిమా వస్తుందని గొడవ చేసినా ఫైనల్ గా నాని సినిమాకు నానీస్ గ్యాంగ్ లీడర్ అని ఫిక్స్ చేశారు.   


ఈ నెల 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. విక్రం చెప్పిన కథకు తాను ఎక్సైట్ అయ్యానని అందుకే ఈ సినిమా చేశానని చెప్పాడు నాని. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంద్రంగంటి మోహనకృష్ణ 'V' సినిమా మీద దృష్టి పెడతాడట. ఇప్పటికే ఆ సినిమా కొంతమేరకు షూటింగ్ జరుపుకుంది.   


అయితే V తర్వాత కూడా మూడు కథలు ఓకే చేశాడట నాని. అవి వి సినిమా రిలీజ్ తర్వాతే ఎనౌన్స్ చేస్తానని అంటున్నాడు. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించే మాట్లాడుదామని తన తర్వాత సినిమాల గురించి తానే స్వయంగా వెళ్లడిస్తా అని అన్నారు నాని.


ఈ ఇయర్ నాని జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవలేదు కాని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ లో నాని జెర్సీ సినిమా కొత్తగా ప్రయత్నించామని.. ఆ సినిమా 30 కోట్లు వసూళు చేసిందని రెగ్యులర్ ఫార్మెట్ లో కాకుండా కొత్తగా వెళ్దామని ఆ సినిమా చేశా ఇక తనేం సినిమా చేయాలో మీరే చెప్పండంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేసి షాక్ ఇచ్చాడు నాని. జెర్సీ కమర్షియల్ గా కూడా హిట్టే అని చెప్పాడు నాని. ఇక గ్యాంగ్ లీడర్ కూడా అదే పంథాలో బాక్సాఫీస్ కళకళలాడేలా చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: