నేను పాముని కాదు – పాము విషాన్ని అంటున్న టాప్ డైరెక్టర్ !

K Prakesh
సంచలనాలకు చిరునామాగా ఉండే రామ్ గోపాల్ వర్మ తాను దర్శకత్వం వహించి ఈవారం విడుదల కాబోతున్న ‘సత్యా2’ సినిమా ప్రమోషన్ కు సంబంధించి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రపంచంలో నేర ప్రవృత్తి ఎప్పుడూ ఉంటుందని మారుతున్న కాలాన్ని బట్టి నేర సంస్కృతి కూడా మారిపోతుందని అంటూ క్రిమినల్ సైకాలజీ పై తాను తీసిన సినిమా ఈ ‘సత్యా-2’ అని అన్నారు. అంతేకాకుండా క్రిమినల్స్ ను స్టడీ చేసినవారందరు క్రిమినల్స్ కానక్కరలేదనీ, తాను కేవలం ఈ సినిమాలో క్రిమినల్ సైకాలజీని మాత్రమే చూపెట్టానని అంటూ ‘నేను పాముని కాదని కేవలం పామువిషాన్ని మాత్రం పరిశోధన చేస్తున్నాను’ అని అనడం ఆ మీడియా సమావేశానికి వచ్చిన పాత్రికేయులను ఆశ్చర్య పరిచింది.  అంతేకాదు ఆక్షణంలో తన మైండ్ కు ఏది అనిపిస్తే అలా సినిమాలు తీస్తానని దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోనని వర్మ అంటున్నాడు. ఈవారం విడుదల కాబోతున్న ఈ సినిమా విజయవంతం కావాలి అని ఆ మీడియా సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు అంటే ఈ సినిమా ఈమధ్య విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన సినిమాను దృష్టిలో పెట్టుకుని తన సత్యా-2 ను చూడవద్దనీ అంటూ నేటి వ్యస్తలో కొత్తరంగు పులుము కుంటున్న సరికొత్త నేర ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపెట్టాను అంటున్నాడు వర్మ. అటు వర్మకూ ఇటు హీరో శర్వానంద్ కు ఈ సినిమా విజయం కీలకంగా మారడంతో ఈవారం ఈసినిమా పై ప్రేక్షకులు ఏమి తీర్పు ఇస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: