వాడటం మొదలుపెడితే.. వర్మ కంటే పెద్ద మొనగాడు ఎవరూ ఉండరు. డైరెక్షన్ లో టాలెంట్ చూపించలేకపోతున్నా.. ప్రమోషన్ లో మాత్రం.. అపార అనుభవాన్ని రంగరిస్తాడు. లేటెస్ట్ మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పబ్లిసిటీ కోసం ప్రభాస్ ను కుల రాజకీయాల్లోకి లాక్కొచ్చాడు వర్మ. రెడ్లు.. కమ్మల మధ్యలో రాజులేంటనా? వర్మ ఏదైనా చేస్తాడు.
సమాజంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడంలో వర్మ ఎక్స్ పర్ట్. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మారడం ఆలస్యం.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ప్రకటించేశాడు. సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందోగానీ.. వరుసపెట్టి పాటలు రిలీజ్ చేసేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9గంటల 27 నిమిషాలకు క్యాస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ.. ముందుగా.. చిన్న ప్రోమో రిలీజ్ చేశాడు వర్మ. కులానికి సంబంధించిన పాట కావడంతో తన కులాన్ని వాడుకుంటూ ప్రభాస్ ను ఇందులోకి లాగేశాడు.
ప్రభాస్ దీ నాదీ ఒకే క్యాస్ట్ అంటూ... వర్మ చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ కు రాజులొక్కరే ఫ్యాన్స్ కాదనీ.. అన్ని కులాల వాళ్లూ అభిమానిస్తారని.. సాహో రిలీజ్ టైమ్ లో వర్మ చేష్టల ప్రభావం సినిమాపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన పైత్యం ప్రభాస్ పై చూపించి బాగానే పబ్లిసిటీ చేసుకుంటున్నా.. సాహో రిలీజ్ కు ముందు కులాల ప్రస్తావన ఎందుకంటూ మండిపడుతున్నారు అభిమానులు.
పబ్లిసిటీ కోసం వర్మ ఎంతకైనా తెగిస్తాడు అనడానికి క్యాస్ట్ సాంగ్ ఒక ఉదాహరణ. క్యాస్ట్ పై పాటను రిలీజ్ చేసేందుకు ముందే తనపై తను కుల ముద్ర వేసుకుంటే.. ఎదుటివాడు ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకపోవడం వర్మ స్ట్రాటజీ. గతంలో తను తీసిన కథ, స్క్రీన్ ప్లే అప్పల్రాజులోని ఓ పాటలో రాజమౌళి.. బోయపాటి.. శంకర్ లాంటి దర్శకులను విమర్శించేందుకు ముందు తనపై తాను సెటైర్ వేసుకున్నాడు.