టాలీవుడ్ లో ‘బొమ్మరిల్లు’ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్ధార్ద్ తరువాత కాలం కలిసిరాక హీరోగా కన్నాసమంత బాయ్‌ఫ్రెండ్ హోదాలో ఎక్కువ ప్రచారం పొందుతున్నాడు. సిద్ధార్థ్ ఇప్పుడు తెలుగు సినిమాలతో కంటే తమిళంలోనే బిజీగా ఉన్నాడు. తమిళంలో వరుసగా రెండు, మూడు విజయాలు అందుకున్న సిద్ధార్థ్ మరో రెండేళ్లలో సమంతని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అని అంటారు. ప్రస్తుతం సిద్ధార్ద్ కోలీవుడ్ లో 5 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇక తనకి టాలీవుడ్ వచ్చే ఆలోచన లేదు అంటున్నాడు.
చూడ్డానికి కుర్రాడిలా కనిపించే సిద్ధార్థ్ వయసు ఎక్కువేననే టాక్ కూడా ఉంది. సిద్ధార్థ్ వయసు 37 పైనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ తన వయసు 33 మాత్రమేనని సిద్ధార్థ్ అంటాడు. ఈ విషయంపై ఈమధ్య కోలీవుడ్ మీడియాకు సిద్ధార్ద్ కు చిన్నపాటి హాస్య రగడ కూడా జరిగింది. ఈమధ్య ఒక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ సిద్ధార్ద్ ని చూసి 'మీరు, ప్రకాష్‌రాజ్ క్లాస్మేట్స్ అంటగా' అని అడిగాడట. దానికి సిద్ధూ తడుముకోకుండా 'కాదు ప్రకాష్‌రాజ్ నాకు జూనియర్, అమితాబ్‌బచ్చన్, నేను క్లాస్మేట్స్' అని ఆన్సర్ ఇచ్చాడట సిద్ధార్థ్ వెటకారం అర్థమైన అందరూ నవ్వుకున్నారట. సిద్ధార్థ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే అని అంటారు. అంతేకాదు సిద్ధార్ద్ మంచి వక్త కూడా అని అంటారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే సమంతకు ప్రియ స్నేహితుడుగా బాగా నచ్చాడు అని అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: