మెగాస్టార్ తనయుడు గానే కాకుండా నటించిన అతి తక్కువ సినిమాలతోనే మెగా అభిమానులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రామ్ చరణ్ కెరియర్ లో ‘మగధీర’ సినిమా ఒక మైలురాయి. నిన్నటిదాకా టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన సినిమాగా చరిత్రకెక్కిన ‘మగధీర’ సినిమాకు సంబంధించి ఒక ఆశక్తికర కధనం ఉంది. మగధీర సినిమా స్క్రిప్ట్ ను తయారు చేసుకున్న తరువాత రాజమౌళి ఈ సినిమాలోని కాలభైరవ పాత్రను ప్రభాస్ చేస్తే బాగుంటుంది అని మనసులో అనుకున్నాడట రాజమౌళి
. ఈ సినిమా కధను ఒకసారి ప్రభాస్ కు చెప్పడం కూడ జరిగిందట, అత్యధిక బడ్జెట్ తో నిర్మించాలిసిన సినిమా కాబట్టి ఈ స్క్రిప్ట్ కు న్యాయం చేయగల పెద్ద నిర్మాతల గురించి రాజమౌళి ఆలోచిస్తూ టాలీవుడ్ లోని ఒకరిద్దరు పెద్ద నిర్మాతలను కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ పై చర్చించినప్పుడు ఇంత బడ్జెట్ తో సినిమాను తీస్తే వర్కౌట్ అవుతుందా అని కొంతమంది నిర్మాతలు ఆరోజులలో రాజమౌళిని ప్రశ్నించారట. ఈ నేపధ్యంలో రాజమౌళి దగ్గర పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఉన్న విషయం అల్లుఅరవింద్ దృష్టికి రావడంతో రాజమౌళిని పిలిపించడం, మాట్లాడటం సినిమాకు ఒకే చెప్పడం కొన్నిరోజుల వ్యవధిలో జరిగిపోయిందట.
ఎప్పుడైతే అరవింద్ నిర్మాతగా మారాడో కాలభైరవ పాత్రకు రాజమౌళి దృష్టిలో ప్రభాస్ కు బదులు రామ్ చరణ్ చేరిపోయాడట. ఆ తరువాత ఆసినిమా సూపర్ హిట్ కావడం, రికార్డులను తిరగరాయడం అందరికి తెలిసిన విషయాలే. ప్రభాస్ కు అవకాసం వచ్చినట్లే వచ్చి చివరకు అది రామ్ చరణ్ సొంతమైంది. ఈ సినిమాతో చరణ్ కెరియర్ గ్రాఫ్ ఒకేసారి ఎంత పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక విధంగా ఆలోచిస్తే ‘మగధీర’ సినిమాకు చరణ్ హీరోగా కావడానికి పరోక్షంగా ప్రభాస్ కారణం అయ్యాడు అనుకోవాలి. అదృష్టం ఉంటే ఇలాగే అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: