హిట్ టాక్ తో ఎవరు !

Seetha Sailaja
అడవి శేషు ‘ఎవరు’ మూవీని విడుదలకు ఒకరోజు ముందుగానే మీడియా వర్గాలకు అదేవిధంగా కొంతమంది ప్రముఖులకు నిన్నరాత్రి స్పెషల్ షో వేసి చూపించడంతో ఈ మూవీ టాక్ తెల్లవారేసరికి బయటకు వచ్చేసింది. ఈ మూవీ కథలో అనుక్షణం అనూహ్యమైన మార్పులు కనిపించడంతో ఈ మూవీ చూసిన ప్రేక్షకులు థ్రిలింగ్ గా ఫీల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ మూవీ కథలో ఉన్న ట్విస్ట్ లు నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి అని ఈ మూవీ చూసినవారు కామెంట్ చేస్తున్నారు. దీనికితోడు ఒక మంచి ట్విస్ట్ తో ఈ మూవీ ఇంటర్వెల్ కార్డు పడటంతో ఈ మూవీ సెకండ్ హాఫ్ పై కూడ సగటు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ మూవీలోని కొత్త తరహా మైండ్ గేమ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయని ఇక ఈ మూవీ చివరిలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకుడుకి ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటూ సినిమాలో సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా సీన్స్ ఉన్నాయని ఈ మూవీ ప్రీమియర్ షోను చూసిన వారు చెపుతున్నారు. వెంకట్ కొత్త దర్శకుడు అయినప్పటికి ఎక్కడా తడబాటు లేకుండా ఈ మూవీని డ్రైవ్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది అని అంటున్నారు. 

చాలరోజుల తరువాత సినిమాలో కనిపించిన రెజీనా పవర్ ప్యాక్ ఫెర్ఫార్మెన్స్‌ అందరికి నచ్చుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక హై ఇంటెన్సిటీతో కూడిన  పోలీస్ అధికారి పాత్రలో అడివి శేషు తన  పాత్రలో అద్భుతంగా రాణించాడు అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఎమోషనల్ కంటెంట్‌తోపాటు టెక్నికల్‌ గా బలమైన అంశాలున్న ఈ మూవీ  ఒక సరికొత్త సస్సెన్స్ థ్రిలర్ అనే ఫీలింగ్‌ ను కల్పిస్తుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీ మల్టీప్లెక్స్  ఎ సెంటర్ ప్రేక్షకులకు బాగా నచ్చినా  బిసి సెంటర్ల ప్రేక్షకులు ఈ మూవీ పై ఎలా స్పందిస్తారు అన్న విషయం పై ఈ మూవీ ఏమేరకు సక్సస్స్ అన్న విషయం ఆధారపడి ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: