బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మించిన రాక్షసుడు సినిమా మంచి టాక్‌తో స్టార్ట్ అయ్యి తొలి వారం కంప్లీట్ చేసుకుంది. బెల్లంకొండ కెరీర్‌లోనే ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా రికార్డులకు ఎక్కింది. వరల్డ్ వైడ్‌గా రూ.17 -18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు రికవరీ చేసింది. ఇక ఇప్పుడు రెండో వారం వచ్చిన సినిమాలకు బ్యాడ్ టాక్ రావడంతో పాటు... వరుసగా నాలుగైదు రోజులు సెలవులు ఉండడంతో బ్రేక్ ఈవెన్‌కు చేరువు అవుతాడని ట్రేడ్ అంచనా వేస్తోంది.
బెల్లంకొండ సరసన అనపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను తమిళ సినిమా ఆధారంగా రీమేక్ చేశారు. కోలీవుడ్‌లో హిట్ అయిన ఈ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా ఏరియా వైజ్ ఫస్ట్ వీక్ వసూళ్లు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా బెల్లంకొండ శ్రీనివాస్ కి ఒక్క హిట్ కూడా పడటం లేదు. దాంతో కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందన్న ఆవేదనలో ఉన్నాడు. ఇటీవల స్టార్ హీరోయిన కాజల్ తో నటించిన ‘సీత’ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాక్షసన్ సినిమా రిమేక్ గా తెలుగు లో రాక్షసుడు గాతెరకెక్కించారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ వచ్చింది. ఈ వారం వరకు ఎలాంటి పోటీ లేకపోవడం గతంలో కన్న కాస్త మెరుగుగానే కలెక్షన్లు రాబట్టింది.
రాక్షసుడు ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్లలో)
నైజాం- 3.20 కోట్లు
సీడెడ్ - 1.10
ఉత్తరాంధ్ర - 1.12
ఈస్ట్ - 0.60
వెస్ట్ - 0.45
కృష్ణ - 0.60
గుంటూరు - 0.61
నెల్లూరు - 0.25
------------------------------------
ఏపీ + తెలంగాణ = 7.93 కోట్లు
------------------------------------