మహేష్ ను టార్గెట్ చేస్తూ వర్మ కులం పేరుతో రచ్చ !

Seetha Sailaja
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తరువాత రామ్ గోపాల్ వర్మ సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు. దీనితో చేయడానికి కొత్త కథలు లేకపోవడంతో కుల వివాదాలు సృష్టిస్తూ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీకి సంబంధించిన హడావిడి మొదలు పెట్టాడు. నిన్న ఉదయం ఈమూవీకి సంబంధించి విడుదల చేసిన లిరికల్ వీడియోకు స్పందన బాగానే వచ్చింది. 

దీనితో జోష్ లోకి వెళ్ళిపోయిన వర్మ ఏకంగా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించి నిన్న విడుదలైన ఇంట్రో టీజర్ తో పోటీ పెట్టుకుంటూ మహేష్ మూవీ టీజర్ కంటే తన మూవీ లిరికల్ వీడియోకు ఎక్కువ హిట్స్ వచ్చాయి అంటూ ఒక సంచలనం క్రియేట్ చేసాడు. అంతేకాదు తెలుగు ప్రజలు సూపర్ స్టార్ల కంటే కులాలను ఎక్కువగా పట్టించుకుంటారు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. 

వర్మ తన లేటెస్ట్ మూవీని హైలెట్ చేస్తూ ఇలాంటి కామెంట్స్ చేసాడు అని భావించినా తెలుగు రాష్ట్రాల ప్రజలలో రోజురోజుకు పెరిగి పోతున్న కుల పిచ్చిని వర్మ కామెంట్స్ ప్రతిబింబిస్తున్నాయి. సీఎమ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కల్యాణ్ తో అందర్నీ పావులుగా చేసుకుని వర్మ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ఈమూవీలో వర్మ ఏమి తీస్తాడు అన్న ఆసక్తి పెరిగి పోయింది. 

వాస్తవాలు ఎలా ఉన్నా వర్మ నిన్న విడుదల చేసిన సాంగ్ వీడియో మహేష్ ఇంట్రో టీజర్ కంటే ముందు వరసలో రెండవ స్థానంలో ఉంది అని వర్మ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు మహేష్ అభిమానులు కలవర పడుతున్నారు. ఏవిషయాన్ని అయినా తనకు ఉపయోగపడే విధంగా మలుచుకోవడంలో వర్మ నిష్ణాతుడు అన్న విషయం మరొకసారి రుజువైంది.  అయితే తెలుగు రాష్ట్రాలలో కులాల ఆదిపత్యంకై పోరాటం  తీవ్ర స్థాయిలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో వాస్తవాలను చెపుతూ సినిమా తీయగల దమ్ము వర్మకు ఉందా అన్నదే సందేహం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: