టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి రెండు భాగాల రిలీజ్ తరువాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇక ప్రస్తుతం ఆయన సినిమా ఇమేజి మరియు మార్కెట్ రేంజి బాలీవుడ్ సూపర్ స్టార్స్ స్థాయికి ఎగబాకింది. ఇకపోతే ఆ రెండు సినిమాల అద్భుత విజయాల తరువాత, ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సాహో సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని వున్న విషయం తెలిసిందే. ఈనెల 30న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని అతి త్వరలో చిత్ర బృందం ఎంతో వేడుకగా నిర్వహించనుందని సమాచారం.
ఇక ఈ విషయాలు ప్రక్కన పెడితే, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే దానిపై కొన్నాళ్లుగా మీడియా వేదికల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది, అలానే ఆమధ్య ఆయనకు మరియు జేజెమ్మ అనుష్కకు పెళ్లి కుదిరినట్లే అంటూ వర్ఛలు కూడా షికారు చేసాయి. అయితే అప్పట్లో ఆ వార్తలను అనుష్క కొట్టిపారేశారు. ఇక నేడు ప్రభాస్ పెళ్లి విషయమై మరొక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితం ప్రభాస్ పెళ్లిని ఆయన కుటుంబసభ్యులు రహస్యంగా నిశ్చయించడం జరిగిందని, ఇక వధువు ఎవరంటే, అమెరికాలో మంచి బిజినెస్ మ్యాన్ గా పేరుగాంచిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని అంటున్నారు. అయితే ఈ వార్తను మీడియాకు ఏ మాత్రం తెలియకుండా ఆయన కుటుంబసభ్యులు జాగ్రత్త పడ్డప్పటికీ,
కొందరు ఈ మ్యాటర్ ను నేడు మీడియాకి లీక్ చేసినట్లు టాక్. వాస్తవానికి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో, ఈ వార్తపై ప్రభాస్ లేదా, ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తేనే కానీ నమ్మలేమని అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి ప్రభాస్ పెళ్లి విషయమై ఇప్పటివరకు ప్రచారం అయిన వార్తల మాదిరి ఇది కూడా ఒట్టి పుకారేనా లేక వాస్తవమా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!